Eric Booker : వామ్మో.. కడుపా చెరువా.. 18సెకన్లలో 2లీటర్ల సోడా తాగేశాడు

అమెరికాలోని న్యూయార్క్ కు చెందిన ఎరిక్ బూకర్ సరికొత్త రికార్డు సృష్టించాడు. 2 లీటర్ల సోడాను కేవలం 18.45 సెకన్లలో తాగేసి గిన్నీస్ రికార్డు సృష్టించాడు.

Eric Booker : వామ్మో.. కడుపా చెరువా.. 18సెకన్లలో 2లీటర్ల సోడా తాగేశాడు

Eric Booker

Updated On : August 14, 2021 / 9:49 PM IST

Eric Booker : అమెరికాలోని న్యూయార్క్ కు చెందిన ఎరిక్ బూకర్ సరికొత్త రికార్డు సృష్టించాడు. 2 లీటర్ల సోడాను కేవలం 18.45 సెకన్లలో తాగేసి గిన్నీస్ రికార్డు సృష్టించాడు. ఎరిక్ కి కూల్ డ్రింక్స్ అంటే ప్రాణం. తెగ తాగుతుంటాడు. అంతేకాదు ఏదైనా ఫాస్టుగా తినడం, తాగడం అలవాటు. ఈ క్రమంలోనే అతడు సోడాను వేగంగా తాగేశాడు. ఎరిక్ బూకర్ సోడా తాగిన వీడియోను గిన్నీస్ ప్రతినిధులు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో ఈ వీడియో వైరల్ అయ్యింది.

కేవలం 18 సెకన్లలో 2 లీటర్ల సోడా తాగడం చూసి నెటిజన్లు విస్తుపోతున్నారు. వామ్మో.. అని ముక్కున వేలేసుకుంటున్నారు. ఎరిక్ ది కడుపా? చెరువా? అనే సందేహం వ్యక్తం చేస్తున్నారు.

ఎరిక్ తాగిన సోడా కమర్షియల్ గా దొరికేదే. చక్కెర రహితంగా ఉంటుంది. కోక్ జీరో అని చెప్పాలి. ఎరిక్ ప్రొఫెషనల్ డ్రింక్ చగ్గర్. అంతేకాదు ర్యాపర్ కూడా. తినడం కూడా చాలా ఇష్టం. అన్ని రకాల సాఫ్ట్ డ్రింక్స్ తాగుతాడు. ఎరిక్ చూడటానికి చాలా లావుగా ఉంటాడు. అతడికి పెద్ద పొట్ట ఉంది.