పులికి కరోనా పాజిటివ్, ప్రపంచంలో ఫస్ట్ టైమ్, జంతువుకి సోకిన వైరస్

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి గురించి మరో షాకింగ్ న్యూస్ బయటపడింది. భయం నిజమైంది. ఏదైతే జరక్కూడదో అదే జరిగింది. ఇప్పటివరకు మనుషులకు

  • Published By: veegamteam ,Published On : April 6, 2020 / 04:42 AM IST
పులికి కరోనా పాజిటివ్, ప్రపంచంలో ఫస్ట్ టైమ్, జంతువుకి సోకిన వైరస్

Updated On : April 6, 2020 / 4:42 AM IST

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి గురించి మరో షాకింగ్ న్యూస్ బయటపడింది. భయం నిజమైంది. ఏదైతే జరక్కూడదో అదే జరిగింది. ఇప్పటివరకు మనుషులకు

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి గురించి మరో షాకింగ్ న్యూస్ బయటపడింది. భయం నిజమైంది. ఏదైతే జరక్కూడదో అదే జరిగింది. ఇప్పటివరకు మనుషులకు సోకిన కరోనా వైరస్ ప్రపంచంలో ఫస్ట్ టైమ్ ఓ జంతువుకి సోకింది. అమెరికాలోని బ్రోంక్స్ జూ (Bronx Zoo)… లోని మలయాన్ జాతికి చెందిన నదియా అనే నాలుగేళ్ల వయసున్న పులికి కరోనా వైరస్ సోకింది. ఈ మేరకు వైద్య పరీక్షల్లో నిర్ధరణ అయ్యింది. ప్రపంచంలో కరోనా సోకిన తొలి జంతువు ఇదే అని అమెరికా ఫెడరల్ అధికారులు తెలిపారు. ఈ జూ న్యూయార్క్ సిటీలో ఉంది.

కొన్ని పులులు, సింహాల్లో దగ్గు, ఆకలి తగ్గిన లక్షణాలు:
నదియాతోపాటూ… మరో ఆరు పులులు, సింహాలు కూడా అనారోగ్యం బారినపడ్డాయి. వాటిలో కొన్నింటికి ఆకలి తగ్గిపోగా… కొన్నింటిలో దగ్గు లక్షణాలు కనిపించాయి. జూ లో ఓ ఉద్యోగికి కరోనా వైరస్ సోకి ఉంటుందనీ, అతని ద్వారా… వాటికి కూడా కరోనా వైరస్ సోకి ఉంటుందని అనుమానిస్తున్నారు. ఎందుకంటే… ఇప్పటివరకూ ఆ ఉద్యోగికి కరోనా వైరస్ లక్షణాలు కనిపించలేదు. మార్చి 27న పులి నదియాలో కరోనా వైరస్ లక్షణాలు కనిపించాయి. ప్రస్తుతం అది రికవరీ అవుతోందని తెలిసింది. న్యూయార్క్‌లో కరోనా ప్రబలిన తర్వాత… మార్చి 16 నుంచి జూని మూసివేశారు.

జంతువుల సంరక్షణ చూసుకునే బృందం.. కొన్ని రోజులుగా పులిలో మార్పులను గమనించింది. పొడి దగ్గు, ఆకలి మందగించినట్టుగా ఉండటంతో ఈ విషయాన్ని వెంటనే వైద్యులకు తెలిపారు. వెంటనే వారు వచ్చి పరీక్షించారు. అన్ని పరీక్షలు నిర్వహించగా.. కరోనా వైరస్ సోకినట్టుగా తేలింది.

పులికి మాత్రమే కరోనా, పెంపుడు జంతువులను దూరంగా ఉంచండి:
బ్రోంక్స్ జూపార్కులో నదియాతో పాటు మరో ఆరు పులులు, సింహాలు అనారోగ్యానికి గురయ్యాయి. దీంతో వాటికి పరీక్షలు చేయగా ఒక్క పులి తప్ప మిగతా జంతువులు కోలుకున్నాయని తేలింది. కరోనా వైరస్ తో బాధపడుతున్న పులిని ఐసోలేషన్ లో ఉంచి ఇతర జంతువులకు సోకకుండా చూడాలని అధికారులు కోరారు. పెంపుడు ప్రాణులను నిత్యం శుభ్రంగా ఉంచాలని, వాటిని తాకిన తర్వాత… చేతుల్ని శుభ్రంగా కడుక్కోవాలని అధికారులు సూచించారు. అంతేకాదు కరోనా సోకిన వారు తమ పెంపుడు జంతువులను తమకు దూరంగా ఉంచడం చాలా మంచిదన్నారు.

పెంపుడు జంతువులు, పక్షుల్లో కరోనా వైరస్ లేదు:
పులికి కరోనా సోకడం సంచలనంగా మారింది. జూ డైరెక్టర్ షాక్ అయ్యారు. నమ్మకలేకపోతున్నట్టు చెప్పారు. ఈ విషయం ప్రపంచ దేశాలకు ఎంతో కొంత ఉపయోగపడగలదని జూ డైరెక్టర్ ఆశాభావం వ్యక్తం చేశారు. వైరస్ ఎలా ప్రబలుతుంది? ఇతర జీవులకు ఎలా పాకుతుందన్నది ఇప్పుడు తెలిసే ఛాన్స్ ఉందన్నారు. ఈ కొత్త విషయం కరోనా వైరస్‌పై కొత్త ప్రశ్నలు రేకెత్తించింది. ప్రస్తుతం అమెరికాలోని పెంపుడు జంతువులు, పక్షుల్లో కరోనా వైరస్ లేదని అమెరికా వ్యవసాయ శాఖ తెలిపింది. జంతువుల ద్వారా కరోనా వైరస్ మనుషులకు సోకి ఉంటుందా అన్న ప్రశ్న ఇప్పుడు వేసుకోవడం సరికాదన్న వ్యవసాయ శాఖ… అమెరికాలో కరోనా వైరస్ వ్యాప్తికి జంతువులే కారణమా అన్నది అసందర్భ ప్రశ్నగా తెలిపింది.

కుక్కలో కరోనా లక్షణాలు:
ఈ ఏడాది ఫ్రిబవరిలో హాంకాంగ్‌లో ఓ కుక్కలో కరోనా లక్షణాలు కనిపించాయి. అయితే దానికి సోకిన కరోనా వైరస్ పాథోజెన్… చాలా తక్కువ స్థాయిదని వైద్యులు తేల్చారు. అందువల్ల పెంపుడు కుక్కలు, పిల్లుల వల్ల మనుషులకు కరోనా రాలేదనీ, అవి వైరస్‌ని వ్యాపింపజెయ్యట్లేదని వివరించారు. ఆ తర్వాత ఇప్పుడు పులికి కరోనా సోకింది. పెంపుడు జంతువులు, పశువుల్లో కరోనా వైరస్ ప్రబలడం కొత్త ప్రశ్నలను లేవనెత్తుతోంది. కేవలం మనుషుల్లో మాత్రమే కరోనా వైరస్ కనిపించింది. ఇప్పుడు జంతువులకు కూడా కరోనా సోకడం స్టార్ట్ అయితే పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయని అంతా భయపడుతున్నారు.

See Also | లాక్ డౌన్ సడలింపు ముందుగా ఎక్కడంటే.. ఏపీలో రెండు జిల్లాలు!