మిస్ వరల్డ్‌గా యాన్ సింగ్.. భారత యువతికి సెకెండ్ ప్లేస్

  • Published By: vamsi ,Published On : December 15, 2019 / 07:12 AM IST
మిస్ వరల్డ్‌గా యాన్ సింగ్.. భారత యువతికి సెకెండ్ ప్లేస్

Updated On : December 15, 2019 / 7:12 AM IST

ప్రపంచంలోనే అత్యంత అందమైన భామ అనిపించుకోవాలని ఎవరికి ఉండదు.. ప్రపంచంలో అందమైన భామను ఎంపిక చేయడం కోసం ప్రపంచ సుందరి పోటీలు ప్రతి ఏడాది నిర్వహిస్తుంటారు. మిస్ విలేజ్, మిస్ కాలేజ్, మిస్ స్టేట్, మిస్ ఇండియా, మిస్ వరల్డ్, చివరికి మిస్ యూనివర్స్ వరకు ఈ పోటీలను నిర్వహిస్తారు. అయితే ఈ ఏడాది ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకుంది 23ఏళ్ల జమైకా భామ టోనీ-యాన్‌ సింగ్‌.

లండన్‌ వేదికగా జరిగిన ఆఖరి పోటీల్లో యాన్ సింగ్ 69వ మిస్ వరల్డ్ విజేతగా నిలవడంతో 2018 మిస్ వరల్డ్ వనెస్సా పోన్సె ఆమెకు కిరీటం అలంకరించారు. మొదటి రన్నరప్‌గా ఫ్రాన్స్‌కు చెందిన ఒఫెలే మెజినో, రెండో రన్నరప్‌గా భారత్‌కు చెందిన సుమన్‌రావు నిలిచారు. టోనీ యాన్ సింగ్‌కు తుది వరకు ఒఫెలే, సుమన్ రావు నుంచి గట్టిపోటీ ఇవ్వగా.. చివరి ప్రశ్నకు ఆమె ఇచ్చిన సమాధానం న్యాయనిర్ణేతలను ఆమెవైపు నిలిచేలా చేసింది. వైద్య విద్య పూర్తిచేసిన యాన్ సింగ్.. అమెరికాలోని ఫ్లోరిడా స్టేట్ యూనివర్సిటీలో ఉమెన్స్ స్టడీస్, సైకాలజీలో పీజీ చేశారు. అలాగే ఫ్లోరిడా యూనివర్సిటీలో కరేబియన్ స్టూడెంట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా పనిచేశారు.

ఈ అందాల పోటీల్లో బాహ్య సౌందర్యం మాత్రమే కాదు, తెలివి తేటలు, సమయస్పూర్తి, ఆలోచనలను పరిగణలోకి తీసుకుంటారు. ఒక్కో సంవత్సరం ఒక్కో దేశం దీనికి వేదిక అవుతుంది. ఈ ఏడాది ప్రపంచ అందాల పోటీలను లండన్‌లో నిర్వహించారు. ఈ పోటీల్లో దాదాపుగా 120 దేశాలకు చెందిన యువతులు పాల్గొనగా.. నవంబరు 20న మొదలైన ఈ పోటీల్లో జమైకా భామ టోనీ-యాన్‌ సింగ్‌ గెలుచుకుంది. రెండో రన్నరప్‌గా భారత్‌కు చెందిన సుమన్‌రావు(20) నిలిచారు. 

ప్రపంచ సుందరి కిరీటాన్ని గెలుచుకున్న నాలుగో జమైకా యువతిగానూ టోనీ యాన్ సింగ్ రికార్డులకు ఎక్కారు. తొలిసారిగా 1963లో జమైకా భామ ప్రపంచ సుందరి కిరీటాన్ని గెలుపొందగా, ఆ తర్వాత 1976, 1993లో ఈ టైటిల్ విజేతలుగా కరేబియన్ దేశం యువతులు నిలిచారు. తిరిగి 26 ఏళ్ల తర్వాత జమైకా నుంచి మరో మహిళ ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకుంది.