కన్ను పడితే ఖతమే..! ప్రపంచంలోనే శక్తివంతమైన గూఢచార సంస్థలు ఏవో తెలుసా..

మూడో కంటికి తెలియకుండా టార్గెట్ ను ఫినిష్ చేయడంలో సాటిరారు.

కన్ను పడితే ఖతమే..! ప్రపంచంలోనే శక్తివంతమైన గూఢచార సంస్థలు ఏవో తెలుసా..

Top Intelligence Agencies (Photo Credit : Google)

Updated On : September 30, 2024 / 9:36 PM IST

Top Intelligence Agencies : ప్రతి దేశానికి ఒక సొంత ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (గూఢచార సంస్థ లేదా సీక్రెట్ సర్వీస్ లేదా నిఘా సంస్థ) ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఇవి చాలా పవర్ ఫుల్ అని చెప్పాలి. దేశ భద్రతలో ఈ నిఘా సంస్థలు కీ రోల్ ప్లే చేస్తాయి. తమ శత్రువులపై నిరంతరం నిఘా ఉంచుతాయి. వారి కదలికలను గమనిస్తుంటాయి. తమ దేశ భద్రతకు ఏదైనా ముప్పు ఉంటే వెంటనే పసిగడతాయి ఈ సీక్రెట్ సర్వీస్ లు. తమ దేశం జోలికి వచ్చే శత్రువుల అంతు చూస్తాయి. మూడో కంటికి తెలియకుండా మట్టుబెట్టేస్తాయి. తద్వారా దేశ భద్రతలో కీలక రోల్ ప్లే చేస్తున్నాయి ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు. మరి, ప్రపంచంలోని అగ్ర గూఢచార సంస్థలు ఏవో మీకు తెలుసా..

1. రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ (RAW-రా)… ఇది భారత్ కు చెందిన ఇంటెలిజెన్స్ ఏజెన్సీ. విదేశీ గూఢచార సంస్థ. భారత్-చైనా, భారత్-పాకిస్తాన్ యుద్ధం తర్వాత విదేశాలపై గట్టి నిఘా ఉంచేందుకు ఏర్పాటు చేసిన సీక్రెట్ స్పై ఇది. ఇతర దేశాల నుంచి మన దేశ భద్రతకు ఉన్న ముప్పును ముందే పసిగట్టడం దీని బాధ్యత.

2. మొసాద్- వరల్డ్ లోనే అత్యంత పవర్ ఫుల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ. ఇజ్రాయెల్ పొలిటికల్ ఇంటెలిజెన్స్ సర్వీస్‌గా 1947లో ఏర్పడిన ఈ స్పై ఏజెన్సీ.. ఇప్పుడు ఇజ్రాయెల్ చేసే యుద్ధాల్లో కీలక పాత్ర పోషిస్తోంది. ఇజ్రాయెల్ కి హాని తలపెట్టాలని చూసే వారి అంతు చూస్తుందీ ఈ సీక్రెట్ సర్వీస్. మూడో కంటికి తెలియకుండా టార్గెట్ ను ఫినిష్ చేయడంలో మొసాద్ కు సాటిలేరు.

3. CIA- సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ.. సీఐఏ అమెరికాకు చెందిన ఫారిన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ. విధాన నిర్ణేతలకు జాతీయ భద్రతా గూఢచారాన్ని అందించే బాధ్యత ఈ సీక్రెట్ సర్వీస్ దే.

4. FSB – రష్యాకి చెందిన ప్రధాన సెక్యూరిటీ ఏజెన్సీ. కౌంటర్ ఇంటెలిజెన్స్, కౌంటర్ టెర్రరిజమ్, అంతర్గత భద్రత.. FSB కీలక బాధ్యతలు.

5. MSS – ఇది చైనాకు చెందిన ప్రాధమిక ఇంటెలిజెన్స్, సెక్యూరిటీ ఏజెన్సీ. దేశీయ, విదేశీ గూఢచార సేకరణ దీని బాధ్యత.

6. MI6- మిలిటరీ ఇంటెలిజెన్స్ సెక్షన్-6.. యునైటెడ్ కింగ్ డమ్ కు చెందిన సీక్రెట్ ఫారిన్ ఇంటెలిజెన్స్ సర్వీస్. అంతర్జాతీయ అంశాలపై ప్రభుత్వానికి గూఢచార సేవలు అందించే సంస్థ.

7. ISI – పాకిస్తాన్ కు చెందిన ప్రీమియర్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ. గూఢచార సేవలు, విశ్లేషణ, కోవర్టు ఆపరేషన్లు దీని బాధ్యత.

Also Read : 30వేల మంది భారతీయులు మిస్సింగ్..! వారంతా ఏమయ్యారు? ఆందోళనకు గురిచేస్తున్న సైబర్ స్లేవరీ..