Ukraine : యుక్రెయిన్‌కు త్వరలో ఎఫ్ 16 ఫైటర్ జెట్‌లు… అమెరికా టాప్ జనరల్ వెల్లడి

యుక్రెయిన్‌ దేశానికి త్వరలో ఎఫ్-16 ఫైటర్ జెట్‌లు వచ్చే అవకాశం ఉందని యునైటెడ్ స్టేట్స్ టాప్ జనరల్ తెలిపారు. రష్యా దాడికి వ్యతిరేకంగా ప్రతి దాడులు చేసేందుకు ఎఫ్ -16 ఫైటర్ జెట్ లను పంపిస్తామని యూఎస్ జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ చైర్మన్ మార్క్ మిల్లీ చెప్పారు....

Ukraine : యుక్రెయిన్‌కు త్వరలో ఎఫ్ 16 ఫైటర్ జెట్‌లు… అమెరికా టాప్ జనరల్ వెల్లడి

F16 Fighter Jets

Updated On : August 25, 2023 / 4:55 AM IST

Ukraine : యుక్రెయిన్‌ దేశానికి త్వరలో ఎఫ్-16 ఫైటర్ జెట్‌లు వచ్చే అవకాశం ఉందని యునైటెడ్ స్టేట్స్ టాప్ జనరల్ తెలిపారు. రష్యా దాడికి వ్యతిరేకంగా ప్రతి దాడులు చేసేందుకు ఎఫ్ -16 ఫైటర్ జెట్ లను పంపిస్తామని యూఎస్ జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ చైర్మన్ మార్క్ మిల్లీ చెప్పారు. (Ukraine To Get F16 Fighter Jets) డెన్మార్క్, నెదర్లాండ్స్ దేశాల నుంచి ఎఫ్-16 లను రానున్నాయని యుక్రెయిన్ ప్రెసిడెంట్ వోలోడొమిర్ జెలెన్స్కీ చెప్పారు.

Chandryaan-3 :చంద్రుడిపై ప్రజ్ఞాన్ రోవర్ మూన్‌వాక్‌ ప్రారంభం…ఇస్రో ల్యాండర్ ఇమేజర్ కెమెరా చిత్రాల విడుదల

ఎఫ్-16 ఫైటర్ జెట్‌లు ఉక్రెయిన్ దేశ వైమానిక రక్షణను బలోపేతం చేస్తామని, ఇవి రష్యా దళాలపై ఎదురుదాడికి సహాయపడతాయని ఆయన చెప్పారు. యుక్రేనియన్లకు గణనీయమైన పోరాట శక్తి ఉందని మిల్లీ చెప్పారు. (Top US General) యుక్రెనియన్ సైనిక విజయం సాధించే అవకాశముందని మిల్లీ చెప్పారు. ఈ సంవత్సరం చివర్లో మిల్లీ పదవీ విరమణ చేయబోతున్నారు.