Train Driver : 144 మందిని కాపాడి.. ప్రాణాలర్పించిన హీరో ట్రైన్ డ్రైవర్‌కు నివాళులు..!

Train Driver : వాయు వేగంతో దూసుకెళ్తోంది బుల్లెట్ ట్రైన్.. కొద్దిసేపట్లో గమ్యం చేరుకోవాల్సి ఉంది. ప్రయాణికులంతా దిగేందుకు అంతా రెడీ అవుతున్నారు.

Train Driver : 144 మందిని కాపాడి.. ప్రాణాలర్పించిన హీరో ట్రైన్ డ్రైవర్‌కు నివాళులు..!

Tributes Pour In For 'hero' Train Driver Who Sacrificed Life To Save 144 Passengers In China's Guizhou

Updated On : June 7, 2022 / 11:30 AM IST

Train Driver : వాయు వేగంతో దూసుకెళ్తోంది బుల్లెట్ ట్రైన్.. కొద్దిసేపట్లో గమ్యం చేరుకోవాల్సి ఉంది. ప్రయాణికులంతా దిగేందుకు అంతా రెడీ అవుతున్నారు. తమ లగేజీని సర్దుకుంటున్నారు. కానీ, తమ గమ్యానికి ముందు ప్రమాదం పొంచి ఉందని మాత్రం గ్రహించలేదు. ఎందుకంటే.. ఆ బుల్లెట్ రైలు వెళ్లే పట్టాలపై పెద్ద ఎత్తున రాళ్ల కుప్పలు, బురద కనిపించాయి. అది గమనించిన బుల్లెట్ ట్రైన్ డ్రైవర్ తన ప్రాణాలకు తెగించి ప్రయాణికులను ప్రమాదం నుంచి కాపాడాడు. ఈ ప్రయత్నంలో 144 మంది ప్రయాణులను రక్షించి తాను మాత్రం ప్రాణాలు కోల్పోయాడు. బుల్లెట్ ట్రైన్ ఆపే ప్రయత్నంలో పట్టాలు తప్పితే ప్రయాణికుల ప్రాణాలు పోతాయని సడన్ బ్రేక్ వేశాడు ట్రైన్ డ్రైవర్. ఆ వేగంలో ట్రైన్ ఆగిపోయినా పట్టాలు మాత్రం తప్పింది. కానీ, అదృష్టవశాత్తూ రైల్లోని ప్రయాణికులు ఎవరికి ప్రమాదం జరగలేదు. బుల్లెట్ ట్రైన్ మాత్రం తీవ్రంగా దెబ్బతిన్నది. వెనుక రెండు బోగీల్లోని ప్రయాణికులు 144 మంది సురక్షితంగా బయటపడ్డారు.

రైలు ఇంజిన్ ముందుభాగం బాగా దెబ్బతినడంతో అందులోని ట్రైన్ డ్రైవర్ అమరుడయ్యాడు. అతడికి పాటు ఉన్న మరో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన చైనాలోని గ్విఝౌ ప్రావిన్స్ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. వందలాది మంది ప్రాణాలను కాపాడిన ఆ ట్రైన్ డ్రైవర్ పేరు. యాంగ్ యంగ్.. ప్రాణత్యాగం చేసి అమరుడైన యాంగ్ ను అక్కడి ప్రజలు హీరో ట్రైన్ డ్రైవర్ గా పిలుచుకుంటారు. ప్రస్తుతం చైనాలో అతడి గురించే చర్చ జరుగుతోంది. ట్రైన్ డ్రైవర్ భౌతిక కాయాన్ని అంబులెన్స్‌లో యాంగ్ స్వస్థలానికి తీసుకెళ్లారు. స్థానిక పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. స్థానిక ప్రజలు సైతం రోడ్లకు ఇరువైపులా నిలబడి డ్రైవర్ భౌతిక కాయానికి సెల్యూట్ చేశారు.

ప్రతిఒక్కరూ యంగ్ కు ఘనంగా నివాళులు అర్పిస్తున్నారు. యాంగ్ యంగ్ త్యాగ నిరతిని నిర్వహిస్తున్నారు. ప్రమాదానికి గురైన D2809 నంబర్ బుల్లెట్ ట్రైన్‌పై హాట్ డిబేట్ నడుస్తోంది. యాంగ్ యంగ్ ఎవరంటే.. అతడో మాజీ సైనికుడు. 1993 నుంచి 1996 వరకు చైనా ఆర్మీలో పనిచేశాడు. స్క్వాడ్ లీడర్ పేరు తెచ్చుకున్న అతడు.. ఆర్మీ నుంచి రిటైర్ అయ్యాడు. ఆ తర్వాత చైనా రైల్వేలో యాంగ్ యంగ్‌కు ఉద్యోగం వచ్చింది. అలా అసిస్టెంట్ డ్రైవర్ స్థాయి నుంచి డ్రైవర్ స్థాయికి యాంగ్ ఎదిగాడు.

Read Also : kim jong un : ప్రపంచ దేశాల్లో దడ పుట్టిస్తున్న నార్త్ కొరియా నియంత ‘కిమ్’..6 నెలల్లో 31 మిసైల్స్ ప్రయోగాలు