ట్రంప్ ఆరోగ్యం విషమం..48 గంటలు కీలకం ?

  • Published By: madhu ,Published On : October 4, 2020 / 06:55 AM IST
ట్రంప్ ఆరోగ్యం విషమం..48 గంటలు కీలకం ?

Updated On : October 4, 2020 / 8:02 AM IST

Trump : అమెరికా అధ్యక్షుడు Trump ఆరోగ్యంపై పుకార్లు షికారు చేస్తున్నాయి. హెల్త్ కండీషన్ (Health Condition) ఏం బాగాలేదంటూ వార్తలు వెలువడుతున్నాయి. 74 ఏళ్ల వయస్సులో ఉన్న ట్రంప్ కరోనా వైరస్ బారిన పడిన సంగతి తెలిసిందే. ముందుగా ట్రంప్‌ అడ్వైజర్ హూప్ హిక్స్‌కు కరోనా పాజిటివ్‌ వచ్చింది.



దీంతో ట్రంప్ దంపతులు కరోనా పరీక్షలు చేయించుకోవడంతో… పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. తన అడ్వైజర్ తో ట్రంప్ సన్నిహితంగా మెలగడంతో వైరస్ బారినపడ్డారు. ఆయన భార్య మెలనీయాకు కూడా వైరస్ సోకింది. ప్రస్తుతం ట్రంప్ వాల్టర్ రీడ్ సైనిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 48 గంటలు అత్యంత కీలకమని వైద్యులు వెల్లడిస్తున్నట్లు సమాచారం.



అయితే..ఆసుపత్రి వర్గాలు మాత్రం భిన్నమైన కథనాలు వెల్లడిస్తున్నాయి. ఆయన ఆరోగ్యం బాగానే ఉందంటున్నారు. జ్వరం, శ్వాస ఇబ్బందులు లేవంటున్నారు. ట్రంప్ కు తొలుత వైట్ హైస్ లోనే చికిత్స అందించారు. ట్రంప్ కోలుకోవడానికి ఎన్ని రోజులు పడుతుందో చెప్పలేమని, డిశ్చార్జ్ అయ్యేందుకు కొన్ని రోజుల సమయం పడుతుందంటున్నారు.



వయస్సు 74 ఏళ్లు కావడం, స్థూలకాయం, కొలెస్టరాల్ ఉండడంతో ఆయన చికిత్స విషయంలో కలవరపెట్టే అంశాలుగా మారాయి. అయితే..తాను ఎంతో బాగున్నా అంటూ ట్రంప్ ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. రెమిడెసివర్ తో పాటు..ప్రయోగాత్మక యాంటీబాడీ ఔషధాలను ట్రంప్ కు ఇస్తున్నారు.



వైరస్ వ్యాప్తి మొదలైన నాటి నుంచి సీనియర్ సిటిజన్స్ ప్రాణాలు ప్రమాదకరంగా మారాయి. ఈ 10 నెలల కాలంలో ఇన్ఫెక్షన్ తాకిడి తీవ్రమైన అనారోగ్యానికి గురవడంతో పాటు.. 80 శాతం మంది చనిపోయారు. 65 ఏళ్లు అంతకంటే పైబడ్డ వారిలో ప్రాణాలతో బయటపడ్డవారు చాలా తక్కువని యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ వెల్లడించింది. ట్రంప్ (74) ఏళ్ల వయస్సులో ఇన్ఫెక్షన్ కు గురవడంతో మహమ్మారితో పోరాడటం చాలా రిస్క్ అంటున్నారు కొంతమంది.