Taliban : తాలిబన్ల ఆగడాలు, యాంకర్‌ను తుపాకులతో బెదిరించారు..వీడియో వైరల్

అఫ్ఘానిస్తాన్‌లో తాలిబన్ల ఆగడాలకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. ఇప్పటికే అక్కడి ప్రజలపై అంతులేని అరాచకాలకు పాల్పడుతున్న ఆ రాక్షసులు.. ఇప్పుడు మీడియాపై ఫోకస్ పెట్టారు.

Taliban : తాలిబన్ల ఆగడాలు, యాంకర్‌ను తుపాకులతో బెదిరించారు..వీడియో వైరల్

Taliban

Updated On : August 30, 2021 / 3:06 PM IST

Afghanistan : అఫ్ఘానిస్తాన్‌లో తాలిబన్ల ఆగడాలకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. ఇప్పటికే అక్కడి ప్రజలపై అంతులేని అరాచకాలకు పాల్పడుతున్న ఆ రాక్షసులు.. ఇపుడు మీడియాపై ఫోకస్ పెట్టారు. మీడియా స్వేచ్ఛను అడ్డుకోబోమని చెప్పిన మాటలను తుంగలో తొక్కేసి… ఏకంగా టీవీ స్టూడియోలోకి చొరబడ్డారు. యాంకర్ ను తుపాకులతో బెదిరించారు.

Read More : Telugu States : వానలే..వానలు..భారీ నుంచి అతి భారీ వర్షాలు, జాగ్రత్త

తమకు వ్యతిరేక వార్తలు ప్రసారం చేస్తున్నారన్న అనుమానంతో టీవీ కార్యాలయానికి వెళ్లిన ఇద్దరు తాలిబన్ ఫైటర్లు. అక్కడున్న స్టూడియోలోకి గన్స్ తో ఎంటరయ్యారు. ప్రతక్ష్య ప్రసారం జరుగుతుండగానే… యాంకర్ వెనక్కు వెళ్లి నిల్చున్నారు. తుపాకులతో బెదిరించారు. తమను ప్రశంసించాలని ఒత్తిడి తెచ్చారు.

Read More : Apple iPhone 13 : నో టవర్ సిగ్నల్.. ఈ ఫోన్లలో శాటిలైట్ నుంచి నేరుగా కాల్స్ మాట్లాడుకోవచ్చు..!

భయపడొద్దని చెప్పి మరీ వారిని పొగిడించుకున్నారు. దీంతో భయంభయంగా వారు చెప్పిన పని చేశారు ఆ యాంకర్. తాలిబన్ల పేరు వింటేనే హడలిపోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో.. వారే ఎదురుగా వచ్చి నిలబడితే ఎలా ఉంటుందన్నది.. ఈ వీడియోలోని యాంకర్ ను చూస్తే అర్థమవుతోంది. ప్రస్తుతం వైరల్ గా మారిన ఈ వీడియో… తాలిబన్ల రాక్షసత్వం ఎలాంటిదో ప్రపంచ ప్రజల కళ్లకు కడుతోంది.