Anchor swallows A fly Live on Air : లైవ్‌లో వార్తలు చదువుతూ ఈగను మింగేసిన యాంకర్

లైవ్ లో వార్తలు చదువుతుండగా ఈగను మింగేసింది ఓ న్యూస్ రీడర్ . ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Anchor swallows A fly Live on Air : లైవ్‌లో వార్తలు చదువుతూ ఈగను మింగేసిన యాంకర్

Updated On : September 3, 2022 / 4:08 PM IST

Anchor swallows a fly while reporting live on air : లైవ్ లో వార్తలు చదువుతుండగా ఈగను మింగేసిన న్యూస్ రీడర్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. లైవ్ లో అదేపనిగా న్యూస్ రీడర్ మాట్లాడుతున్న క్రమంలో ఓ ఈగ వచ్చి న్యూస్ రీడర్ నోటిలోకి పోయింది. వార్తలు అదేపనిగా చదువుతున్న ఆమె నోట్లోకి ఓ ఈగ దూరింది. ఆ సమయంలో బ్రేక్ తీసుకోవడానికి కుదరదు. దీంతో.. ఆమె ఏకంగా ఆ ఈగను మింగేసింది. న్యూస్ చెప్పడం మాత్రం ఆపలేదు కెనడాకు చెందిన జర్నలిస్టు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. అయితే.. ఈ వీడియోని సదరు జర్నలిస్టే స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఆ వీడియో కాస్తా తెగ వైరల్ అవుతోంది. ఆ ఈగను మింగేసిన న్యూస్ రీడర్ పేరు ‘ఫరా నాసర్’..

పాకిస్తాన్ లో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వరదలు ముంచెత్తాయి. ఈ భారీ వర్షాలకు అక్కడి ప్రజలు ఎంత అవస్త పడుతున్నారో.. వరదలు ఎలా ముంచెత్తుతున్నాయో జర్నలిస్ట్ ఫరా నాసర్ లైవ్ లో వివరిస్తున్నారు. అంత సీరియస్ గా ఆమె పరిస్థితిని వివరిస్తున్న క్రమంలో ఈగ నోట్లోకి దూరింది. లైవ్ కాకుంటే ఆమె బ్రేక్ తీసుకొని ఉండేవారేమో. కానీ కుదరదాయె. దీంతో ఆమె సమయస్ఫూర్తిగా వ్యవహరించి..ఈగను మింగేసింది. అది లైవ్ కావడం, అందులోనూ సీరియస్ మ్యాటర్ కావటంతో ఆమె బ్రేక్ తీసుకోకుండా వార్తల్ని కంటిన్యూ చేశారు.

ఆ వీడియోని ఫరా ట్విట్టర్ లో షేర్ చేశారు. దీంతో… అది వైరల్ గా మారింది. అయితే…. ఆమె డెడికేషన్ నెటిజన్లకు విపరీతంగా నచ్చింది. వర్క్ పట్ల ఉన్న డెడికేషన్ సూపర్ అంటూ కొనియాడుతున్నారు. ఈ వీడియోకు పాకిస్థాన్ వర్షాల కంటే ఎక్కువగా వ్యూస్ వర్షం కురుస్తోంది.