Nepal Earthquake: నేపాల్‌ను వణికించిన వరుస భూకంపాలు
నేపాల్ కాలమానం అర్థరాత్రి 1.23 గంటల సమయంలో ముందుగా మొదటిసారి భూమి కంపించింది. బాగ్లుంగ్ జిల్లా అధికారి చౌర్ ప్రాంతంలో రిక్టర్ స్కేలుపై 4.7 తీవ్రతతో భూకంపం వచ్చింది. ఆ తర్వాత గంట కూడా గడవకముందే మరింత ఎక్కువ తీవ్రతతో మరో భూకంపం నేపాల్‍లో వచ్చింది

Earthquake in Nepal
Nepal Earthquake: వరుస భూకంపాలు నేపాల్ దేశాన్ని కుదిపివేశాయి. బుధవారం అర్తరాత్రి దాటిన అనంతరం గంట వ్యవధిలోనే రెండు సార్లు భూకంపం సంభవించింది. దేశంలోని బజురా దహకోట్ ప్రాంతంలో సంభవించిన ఈ భూకంపాలు రిక్టర్ స్కేలుపై 5.9, 4.8గా నమోదయ్యాయని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ వెల్లడించింది. అయితే ఇందులో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలుస్తోంది. అర్ధరాత్రి రెండు సార్లు భూకంపం సంభవించడంతో ఇళ్లలో నిద్రపోతున్న ప్రజలు బయటకు పరుగులు తీశారు. గతంలో 2015లో నేపాల్ దేశంలో భారీ భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో భారీగా ఆస్తినష్టం, ప్రాణనష్టం సంభవించింది. దీంతో భూమి కంపించినపుడల్లా నేపాల్ ప్రజలు ఉలిక్కి పడుతున్నారు.
SCO Meeting: ఢిల్లీలో జరుగుతున్న రక్షణ మంత్రుల సమావేశంలో పాల్గొననున్న పాకిస్తాన్
నేపాల్ కాలమానం అర్థరాత్రి 1.23 గంటల సమయంలో ముందుగా మొదటిసారి భూమి కంపించింది. బాగ్లుంగ్ జిల్లా అధికారి చౌర్ ప్రాంతంలో రిక్టర్ స్కేలుపై 4.7 తీవ్రతతో భూకంపం వచ్చింది. ఆ తర్వాత గంట కూడా గడవకముందే మరింత ఎక్కువ తీవ్రతతో మరో భూకంపం నేపాల్‍లో వచ్చింది. బాగ్లుంగ్ జిల్లా పరిధిలోని ఖుంగా ప్రాంతంలో 2.07 గంటల సమయంలో రెండోసారి భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.3గా నమోదైంది. ఈ భూకంపాల వల్ల ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ జరగలేదని స్థానిక అధికారులు తెలిపినప్పటికీ.. పూర్తి వివరాలు ఇంకా తెలియరావాల్సి ఉంది.