పక్కా నిజం : ట్విట్టర్ సీఈవో జీతం రూ.100
సోషల్ మీడియా మధ్యవర్తిత్వంతో కూడిన టెక్నాలజీ. నేటి సాంకేతిక ప్రపంచంలో కమ్యూనికేషన్ల ద్వారా సోషల్ మీడియా పరిచయం ప్రతి ఒక్కరికి సులభం అయింది.

సోషల్ మీడియా మధ్యవర్తిత్వంతో కూడిన టెక్నాలజీ. నేటి సాంకేతిక ప్రపంచంలో కమ్యూనికేషన్ల ద్వారా సోషల్ మీడియా పరిచయం ప్రతి ఒక్కరికి సులభం అయింది.
ట్విట్టర్.. ఈ మాట వింటే చాలు ఏమొచ్చింది.. కొత్త విషయం ఏంటీ అని ఠక్కున ఆరా తీస్తాం.. సోషల్ మీడియా ఫ్లాట్ ఫాంలో ఓ సంచలనం. అలాంటి నెట్ వర్క్ సంస్థ సీఈవో జీతం ఎంత ఉంటుంది అనే ప్రశ్న వస్తేనే.. కోట్లలో అని ఠక్కున చెప్పేస్తాం. కానేకాదంట.. కేవలం 100 రూపాయలు. వెటకారాలు వద్దు అని అనుకుంటున్నారా.. ఇది అక్షర సత్యం. ట్విట్టర్ సీఈవో జాక్ డోర్సే తీసుకునే జీతం అమెరికాలో డాలర్లలో 1.40 డాలర్లు అయితే.. భారతీయ రూపాయల్లో 100 మాత్రమే.
Read Also : పోల్ జర్నీ : టోల్ ప్లాజాల దగ్గర ట్రాఫిక్ రద్దీ
జీతం 100 రూపాయలు తీసుకొచ్చు.. అలవెన్సులు, సౌకర్యాలు మాత్రం కోట్లలో ఉండొచ్చు అని అనుకుంటున్నారా.. అబ్బే అదీ లేదు. జీతంతో సహా కంపెనీ ఇచ్చే ఏ సదుపాయాలు తీసుకోవటం లేదు. ఆఫీసుకు కూడా సొంత ఖర్చులతోనే వచ్చిపోతున్నాడు. 2015 నుంచి 2018 వరకు ఇదే పరిస్థితి. కేవలం రూ.1.40 డాలర్ల వేతనాన్ని తీసుకున్నారని ఎస్ఈసీకి అందించిన సమాచారంలో కంపెనీ వెల్లడించింది.
మరి ఎలా బతుకుతాడు అనే డౌట్ రావొచ్చు. జీతం తీసుకోకపోవచ్చు కానీ.. ఆయనకు కంపెనీలో షేర్లు ఉన్నాయి. 18 మిలియన్ల షేర్లు ఉన్నాయి. వాటి విలువ 529 మిలియన్ల డాలర్లుగా అంచనా వేస్తున్నారు. ఇండియన్ కరెన్సీలో 3వేల కోట్ల రూపాయలుగా అంచనా వేస్తున్నారు. ఇన్ని వేల కోట్లు ఆస్తి ఉంటే.. ఇంకెందుకు జీతం…
Read Also : 11న సెలవు ప్రకటించని సంస్థలపై చర్యలు : దాన కిషోర్