ట్విట్టర్ ఏరివేత : 1.6 లక్షల టెర్రర్ ప్రమోటెడ్ అకౌంట్లు తొలగింపు
సోషల్ మీడియా మైక్రో బ్లాగింగ్ ట్విట్టర్.. టెర్రర్ రిలేటెడ్ అకౌంట్లను ఏరివేస్తోంది. ఆరు నెలల్లో లక్షకు పైగా అనుమానిత అకౌంట్లను సస్పెండ్ చేసింది.

సోషల్ మీడియా మైక్రో బ్లాగింగ్ ట్విట్టర్.. టెర్రర్ రిలేటెడ్ అకౌంట్లను ఏరివేస్తోంది. ఆరు నెలల్లో లక్షకు పైగా అనుమానిత అకౌంట్లను సస్పెండ్ చేసింది.
శాన్ ఫ్రాన్సిస్ కో : సోషల్ మీడియా మైక్రో బ్లాగింగ్ ట్విట్టర్.. టెర్రర్ రిలేటెడ్ అకౌంట్లను ఏరివేస్తోంది. ఆరు నెలల్లో లక్షకు పైగా అనుమానిత అకౌంట్లను సస్పెండ్ చేసింది. ఉగ్రవాదాన్ని ప్రొత్సహించేలా ఉన్న (1 లక్ష 66వేల 513) ట్విట్టర్ అకౌంట్లను తొలగించినట్టు ఓ నివేదిక వెల్లడించింది. జూలై-డిసెంబర్ 2018 మధ్యకాలంలో ట్విట్టర్ ప్లాట్ ఫాంపై ఉగ్రవాదాన్ని ప్రొత్సహించేలా ఉన్న అకౌంట్లను గుర్తించి డిలీట్ చేసినట్టు తెలిపింది. లీగల్ పాలసీ అండ్ సేఫ్టీ లీడ్ ప్రకారం.. ట్విట్టర్ ప్లాట్ ఫాంపై 19 శాతం ఉగ్రవాదానికి సంబంధించిన ట్వీట్లను (జనవరి -జూన్ 2018) తొలగించినట్టు పేర్కొంది.
91 శాతం వరకు ట్విట్టర్ అకౌంట్లను సస్పెండ్ చేసినట్టు తమ బ్లాగ్ పోస్టులో తెలిపింది. మేజార్టీ కేసుల్లో అకౌంట్ సెటప్ స్టేజీ, ట్వీట్లను రివ్యూ చేసి చర్యలు తీసుకోవడం జరుగుతుందని ట్విట్టర్ స్పష్టం చేసింది. ‘86 దేశాల ప్రభుత్వ ఇన్ఫర్మేషన్ నుంచి రిక్వెస్ట్ లు అందాయి. గ్లోబల్ ఇన్ఫర్మేషన్ రిక్వెస్ట్ ల్లో అమెరికా మాత్రం 30 శాతంగా ఉంది. 35శాతం అన్ని గ్లోబల్ అకౌంట్లు ఒకే కేటగిరీ కింద నిర్దేశించడం జరిగింది’ అని లీగల్ పాలసీ వెల్లడించింది.
అమెరికా తర్వాత రెండో అతిపెద్ద ఇన్ఫర్మేషన్ రిక్వెస్ట్ పంపిన దేశంగా జపాన్ 24శాతంగా ఉంది. లండన్ (13శాతం), ఇండియా (6శాతం), జర్మనీ (6శాతం), ఫ్రాన్స్ (5శాతం) మొత్తం కలిపి గ్లోబల్ ఇన్ఫర్మేషన్ రిక్వెస్ట్ లు 30శాతంగా ఉంటే.. 29 శాతం అన్ని గ్లోబల్ అకౌంట్లు నమోదయ్యాయి. ట్విట్టర్ ప్లాట్ ఫాంపై టెర్రర్ రిలేటెడ్ కంటెంట్ ను తొలగించాల్సందిగా కోరుతూ 8 శాతం కొన్ని గ్లోబల్ లీగల్ రిక్వెస్ట్ లు రాగా, వాటిలో దాదాపు 2 శాతంగా కొన్ని అకౌంట్లపైనే టెర్రర్ ప్రభావం ఉన్నట్టు గుర్తించినట్టు లీగల్ పాలసీ తెలిపింది.
48 దేశాల నుంచి ట్విట్టర్ కు లీగల్ రిక్వెస్ట్ లు అందగా.. వాటిలో 27వేల 283 అకౌంట్లు బల్గరియా, కైరిజిస్థాన్, మెకోడొనియా, స్లొవేనియా దేశాలు ఉన్నాయి. చైల్డ్ సెక్సువల్ ఎక్స్ ప్లోటేషన్ కు సంబంధించి ఉల్లంఘించిన మొత్తం 4లక్షల 56వేల 989 యూనిక్ అకౌంట్లను ట్విట్టర్ సస్పెండ్ చేసినట్టు నివేదిక తెలిపింది. టెక్నాలజీ సొల్యుషన్ తో కూడిన 96 శాతం యూనిక్ అకౌంట్లను కూడా ట్విట్టర్ సస్పెండ్ చేసింది.