తీవ్రమైన కోవిడ్ -19 కేసులకు మందు ఇదేనా?: మూడింట రెండు వంతుల మందికి నయమైందట!

కరోనా మహమ్మారి దెబ్బకు ప్రపంచం వణికిపోతున్నది. మందుల కోసం, వ్యాక్సిన్ల కోసం విస్తృతంగా పరిశోధనలు చేస్తున్నారు సైంటిస్టులు. 195 దేశాలకు పాకిన వైరస్ పకపకా విషపు నవ్వు నవ్వుతున్న సమయంలో ఎక్కడైనా దీనికి మందు కనిపెట్టాం అనే శుభవార్త వినిపిస్తుందా? విందాం.. చూద్దాం సంబరాలు చేసుకుందాం అని ఎదురుచూస్లున్నారు ప్రజలు.
ఇప్పటివరకు ఎక్కడా కూడా అటువంటి ఛాయలు కనిపించకపోవడం కాస్త నిరాశపరిచే విషయమే. అయితే కోవిడ్–19 వైరస్‌లో దశాబ్దం కింద వచ్చిన ఎబోలా వైరస్ లక్షణాలే ఎక్కువగా ఉన్నాయని.. అందుకే ఎబోలా యాంటీ వైరల్ డ్రగ్ రెమ్‌డెసివిర్ ప్రాణాంతక వైరస్ కట్టడికి ఉపయోగపడుతుందని చెబుతున్నారు.
మూడింట రెండు వంతులు కోవిడ్ కేసులు ఈ ఔషదం కారణంగా మెరుగుపడుతున్నట్లు చెబుతున్నారు. దీనిని ప్రపంచ ఫార్మా దిగ్గజం గిలియడ్ సైన్సెస్ కంపెనీ.. అభివద్ధి చేసింది. చాలా తీవ్రమైన కేసుల్లో కూడా ఈ డ్రగ్ బాగా పనిచేసిందని చెబుతున్నారు. దీంతో కొత్త మందులు కాదు, పాత మందులతోనే రోగం నయం అవుతుందనే అంచనాకు వస్తున్నారు.
మరోవైపు అమెరికాలోనూ, ఇతర దేశాల్లోనూ మన దేశంలో మలేరియాకు వాడే క్లోరోక్విన్ మందును వాడుతున్నారు. కోవిడ్ -19 చికిత్స కోసం మలేరియా ఔషధమైన హైడ్రాక్సీక్లోరోక్విన్ వాడుతున్నప్పటికీ, తీవ్రమైన సమస్యలను నివారిస్తుందో లేదో తెలుసుకోవడానికి ట్రయల్ దశలోనే ఉన్నారు. ఇది తీవ్రమైన సమస్యను పరిష్కరిస్తుంది అనేదానిలో మాత్రం ఎటువంటి అధ్యయనాలు లేవు. (Ask KTR : RGV కి KTR పంచ్)