Parrot : చిత్రహింసలు పెట్టి చిలుకను చంపిన ఇద్దరు మహిళలకు జైలు శిక్ష

ముద్దు ముద్దు మాటలు చెప్పే చిలుకను చంపినందుకు కోర్టు ఇద్దరు మహిళలకు జైలు శిక్ష విధించింది. అత్యంత అమానుషంగా చిలుకను చంపిన మహిళలకు జైలుశిక్ష విధించింది.

Parrot : చిత్రహింసలు పెట్టి చిలుకను చంపిన ఇద్దరు మహిళలకు జైలు శిక్ష

England Womans pet parrot slaying jailed

Updated On : August 30, 2023 / 4:52 PM IST

చిలుక చూడటానికి ఎంత అందంగా ఉంటుందో దాని ముద్దు ముద్దు పలుకులు అంతకంటే అందంగా వినసొంపుగా ఉంటాయి. చిలుకలను చాలామంది ముచ్చటపడి పెంచుకుంటారు.ప్రాణంగా చూసుకుంటారు. కానీ పెంచుకున్న చిలుకనే చిత్రహింసలు పెట్టిన చంపారు ఇద్దరు మహిళలు. వారి చేతిలో హింసలు అనుభవించి ప్రాణాలు విడిచింది ఆ చిలుకమ్మ. చిలుకను అత్యంత పాశవికంగా చంపిన ఆ ఇద్దరు మహిళలకు కోర్టు జైలుశిక్ష విధిస్తు తీర్పునిచ్చి ఇంగ్లండ్ (England)కార్లిస్లే క్రౌన్ కోర్ట్(Carlisle crown court)

ఇంగ్లాండు(England)లో ట్రేసి డిక్సన్ (Tracy Dixon) అనే 47 ఏళ్ల మహిళ, నికోలా బ్రాడ్లే(Nicola Bradley)అనే 35 ఏళ్ల మహిళ కలిసి 2022 జూలైలో ఓ మాజీ సైనికుడు పెంచుకుంటున్న ఆఫ్రియన్ గ్రే (african grey parrot)పెంపుడు చిలకను చంపేశారు. పీలక దాకా మద్యం తాగినవారికి ఒళ్లు పై తెలియలేదు. మనుషులం అనే మాటే మర్చిపోయారు. మద్యం మత్తులో ఏం చేస్తున్నామో తెలియని ఉన్మాదంలో పిచ్చెత్తి చిలుకను అమానుషంగా చంపేశారు. అత్యంత పాశవికంగా చిత్రహింసలు పెట్టి మరీ చంపేశారు.

Lover kissing : ప్రియురాలిని ముద్దు పెట్టుకుని కర్ణభేరి పగిలి ఆస్పత్రిపాలైన యువకుడు

నికోలా, ట్రేసీలకు ఓ ఫ్రెండ్ ఉన్నాడు. అతని పేరు పాల్ క్రూక్స్(Paul Crooks). అతను మాజీ సైనికుడు. క్రూక్స్ ‘ఆఫ్రికన్ గ్రే’ (african grey parrot)జాతి చిలుకను పెంచుకుంటున్నాడు. దానికి ముద్దుగా స్పార్కీ అని పేరు పెట్టుకున్నాడు. స్పార్కీ అని పిలిస్తే చక్కగా పలుకుతుంది మాటలు నేర్చిన ఆ చిలుక. చక్కటి పాటలు పాడుతుంది. ముద్దు ముద్దుగా మాట్లాడుతుంది. క్రూక్స్ మాటలకు బదులు చెబుతుంది. అలా ఓ రోజున నికోలా, ట్రేసీలు క్రూక్స్ ఇంటికెళ్లారు. ఆ సమయానికి అతను నిద్రపోతున్నాడు. దీంతో వారి కళ్లు ఆ చిలుకమీద పడింది. అప్పటికే మద్యం మత్తులో ఉన్నారు. ఈ చిలుక దగ్గరకెళ్లి చిలుకపై ఓవెన్ క్లీనర్ స్ప్రే చేశారు. అంతేకాదు చిలుకను గ్లాస్ పెయింట్‌లో ముంచిలేపారు. మెడ విరిచి, వాషింగ్ మిషన్‌లోని డ్రయర్ లో పడేశారు. అక్కడితో ఊరుకోలేదు. మిషన్ లోంచి బయటకు తీసి పెంపుడు కుక్కకు తినిపించడానికి ప్రయత్నించారు.

అదే సమయానికి క్రూక్స్ నిద్ర లేచాడు. వారి చిత్రహింసలకు అప్పటికే చనిపోయిన చిలుకను చూసి విలవిల్లాడిపోయాడు. ఆగ్రహంతో ఊగిపోయాడు. ఇద్దరిని ఇష్టమొచ్చినట్లు తిట్టాడు. వెంటనే వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ కేసు కోర్టుకెళ్లింది. విచారణ కొనసాగింది. చివరకు విచారణలో ట్రేసీ, నికోలాలు చేసిన అమానుషం నిరూపణ అయ్యింది. కోర్టు ఇద్దరికీ 25 నెలల జైలు శిక్ష విధించింది. వారిద్దరు జీవించి ఉన్నంత కాలంలో ఏ జంతువునూ, పక్షినీ పెంచుకోకూదని ఆదేశాలు జారీ చేరారు జడ్జ్ ఆర్చర్(Judge Archer).