అమెరికా ఎన్నికలు, మైక్, కమలా హాట్, హాట్ చర్చ

  • Publish Date - October 8, 2020 / 10:59 AM IST

U.S. vice presidential debate : అమెరికా ఉపాధ్యక్ష అభ్యర్థుల‌ మధ్య తొలిసారి ముఖాముఖి జరిగింది. సాల్ట్‌లేక్‌లోని కింగ్స్‌ బర్రీహాల్‌లో జరిగిన తొలి డిబేట్‌ హాట్‌హాట్‌గా నడిచింది. కోవిడ్‌ నేపథ్యంలో అభ్యర్థుల మధ్య గ్లాస్‌ మాస్క్‌ ఏర్పాటు చేశారు. కరోనాను అరికట్టడంలో ట్రంప్‌ విఫలమయ్యారని.. అమెరికా చరిత్రలో ట్రంప్‌ ఓ విఫల అధ్యక్షుడని డెమోక్రాటిక్‌ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి కమల హారిస్ తీవ్రంగా విమర్శించారు.



అయితే కమల విమర్శలను రిపబ్లిక్‌ పార్టీ ఉపాధ్యక్ష అభ‍్యర్థి మైక్‌ పెన్స్ కొట్టి పారేశారు. కరోనాను అడ్డుకోవడంలో ట్రంప్‌ విజయవంతం అయ్యారని… ఆయన తీసుకున్న చర్యలతోనే వేలాదిమంది అమెరికన్లు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారని స్పష్టం చేశారు. కరోనా వైరస్‌పై ట్రంప్‌కు జనవరిలోనే తెలిసినా ఎలాంది ముందస్తు చర్యలు తీసుకోలేదని కమల ఆరోపించగా… చైనాకు ప్రయాణాల్ని నిషేధించడంలో ట్రంప్‌ సమర్థంగా పనిచేశారని మైక్‌ పెన్స్‌ అన్నారు.



ప్రజల ఆరోగ్య భద్రత కోసం ఏర్పాటు చేసిన ఒబామా కేర్ ట్రస్ట్‌ను రద్దు చేయడంపై కమల తీవ్రంగా మండిపడ్డారు. ఒబామా కేర్‌ను ట్రంప్‌ నిర్వీర్యం చేశారని ఫైరయ్యారు. అయితే ప్రజలకు సేవలందించడంతో ఒబామా హెల్త్‌కేర్‌ దారుణంగా విఫలమైందని… అందుకే ట్రస్ట్‌ను రద్దు చేశామని మైక్‌ పెన్స్‌ తమ చర్యల్ని సమర్థించుకున్నారు. ఇక డ్రాగన్‌ కంట్రీతో వాణిజ్య యుద్ధంలో ట్రంప్‌ ఘోరంగా విఫలమయ్యారని కమల ఆరోపిస్తే… జైబోడెన్‌ చైనాకు చీర్‌ లీడర్‌లా వ్యవహరిస్తున్నారని మైక్‌ పెన్స్‌ కౌంటర్‌ ఇచ్చారు.