International Travel: యూఏఈ రమ్మంటున్నా.. ఇండియా పంపడం లేదు
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ టూరిస్ట్ అప్లికేషన్స్ కు అప్లై చేసుకునేందుకు అందరికీ అనుమతులిచ్చింది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ద్వారా అప్రూవల్ పొందిన వ్యాక్సిన్లు వేసుకున్న ప్రతి ఒక్కరినీ

International Flights
International Travel: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ టూరిస్ట్ అప్లికేషన్స్ కు అప్లై చేసుకునేందుకు అందరికీ అనుమతులిచ్చింది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ద్వారా అప్రూవల్ పొందిన వ్యాక్సిన్లు వేసుకున్న ప్రతి ఒక్కరినీ ఆహ్వానిస్తున్నామని చెప్పింది. ఆ దేశం టూరిజం సెక్టార్ బూస్ట్ అయ్యేందుకు పక్కా ప్రణాళికలు రెడీ చేసింది.
ఈ నిర్ణయం అన్ని దేశాల్లోనూ పౌరులకు వర్తిస్తుందని.. గతంలో నిషేదం విధించిన దేశాల వారిని కూడా రావొచ్చని వెల్లడించారు. ఆర్థికాభివృద్ధి పెరగడం కోసం, పరిస్థితుల నుంచి నిలదొక్కుకోవడం కోసమే ఈ స్ట్రాటజీ అమలుపరుస్తున్నట్లు అక్కడి న్యూస్ ఏజెన్సీ తెలిపింది.
ఈ కొత్త రూల్స్ ఆగష్టు 30 నుంచి అమల్లోకి వస్తాయని చెప్తున్నారు. టూరిస్ట్ వీసాల మీద రావాలనుకునేవారి వ్యాక్సినేషన్ స్టేటస్ తప్పకుండా చూపించాలి. అది కూడా గవర్నమెంట్ హెల్త్ యాప్ లో ఉన్న వివరాలే పరిగణిస్తారు. ఎయిర్ పోర్టులోనూ ర్యాపిడ్ టెస్టింగ్ చేస్తారు.
#NCEMA & ICA: Starting from 30th August, application for tourist visas will be open to people from all countries, provided that they are fully vaccinated with one of the WHO-approved COVID-19 vaccines.#TogetherWeRecover pic.twitter.com/dTsB5pNXvd
— NCEMA UAE (@NCEMAUAE) August 29, 2021
ఇండియా, పాకిస్తాన్, నైజీరియా, యూఏఈ దేశాలకు విధించిన నిబంధనలు ఒక్కొక్కటిగా సడలిస్తూ వస్తుంది. అబుదాబి, దుబాయ్ లాంటి పెద్ద నగరాల్లో ఉండేందుకు కూడా విదేశీయులకు అనుమతిలిస్తున్నారు. డబ్ల్యూహెచ్ఓ ఆస్ట్రాజెనెకా, జాన్సన్ అండ్ జాన్సన్, మోడర్నా, ఫైజర్, సినోఫార్మ్, సినోవాక్ లాంటి వ్యాక్సిన్లకు అప్రూవల్ ఇచ్చింది.
ఓ వైపు యూఏఈ అనుమతిలిచ్చినా.. ఇండియా నుంచి వెళ్లడానికి, ఇండియాకు రావడానికి ఇంటర్నేషనల్ జర్నీని సెప్టెంబర్ 30వరకూ నిలిపేసింది డీజీసీఏ.