Covid In UK : బ్రిటన్ లో ఒక్కరోజే 1లక్షా 6వేలకు పైగా కోవిడ్ కేసులు

: బ్రిటన్ లో కరోనా విలయతాండవం చేస్తోంది. రోజురోజుకి కోవిడ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 1లక్షా 6వేల 122 కోవిడ్ కేసులు,140 మరణాలు నమోదయ్యాయి.

Covid In UK : బ్రిటన్ లో ఒక్కరోజే 1లక్షా 6వేలకు పైగా కోవిడ్ కేసులు

Uk

Updated On : December 22, 2021 / 10:47 PM IST

Covid In UK : బ్రిటన్ లో కరోనా విలయతాండవం చేస్తోంది. రోజురోజుకి కోవిడ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 1లక్షా 6వేల 122 కోవిడ్ కేసులు,140 మరణాలు నమోదయ్యాయి. గతేడాది కరోనా వైరస్ వ్యాప్తి ప్రారంభమైనప్పటి నుంచి బ్రిటన్ లో ఒక్కరోజులో నమోదైన కేసుల్లో ఇదే అత్యధికం.

ఇక,మంగళవారం 90,629 కొత్త కోవిడ్ కేసులు నమోదైనట్లు బ్రిటన్ ప్రకటించిన విషయం తెలిసిందే. మరోవైపు,బ్రిటన్ లో కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు కూడా భారీగానే నమోదవుతున్నాయి. 40 వేలకు పైగా ఒమిక్రాన్ కేసులు బ్రిటన్ లో ఇప్పటివరకు నమోదయ్యాయి.

మరోవైపు, కరోనా వైరస్ కారణంగా భాగా ప్రభావితమైన యూరప్ దేశాల్లో బ్రిటన్ ఒకటి. బ్రిటన్ లో ఇప్పటివరకు 1కోటి 10లక్షలకు పైగా పాజిటివ్ కేసులు నమోదుకాగా… 1లక్షా 47వేల 573 కోవిడ్ మరణాలు సంభవించాయి. అర్హులైనవారందరూ కోవిడ్ వ్యాక్సిన్ థర్డ్ డోస్ తీసుకోవాలని బోరిస్ సర్కార్ బ్రిటన్ ప్రజలను కోరుతోంది. బ్రిటన్ లో ఇప్పటివరకు 3కోట్ల మందికిపైగా కోవిడ్ వ్యాక్సిన్ బూస్టర్ డోస్ తీసుకున్నారు.

ALSO READ Only Vaccinated People : వ్యాక్సిన్ తీసుకోనివారికి బహిరంగ ప్రదేశాల్లోకి నో ఎంట్రీ