సో క్యూట్ : జూలో 2 అంగుళాల కోతికూనల సందడి..

UK chester zoo twin monkeys just 2 inches : ఈ కోతులు ప్రపంచంలోనే అత్యంత చిన్నవి. యూకేలోని చెస్టర్ జూలో ఉన్న ప్రపంచంలోనే అత్యంత చిన్నజాతికి చెందిన కోతి రెండు కవల పిల్లలను జన్మనిచ్చింది. ఈ కోతికూనలు ఎంత ముద్దుగా ఉన్నాయంటే..వాటిని హఠాత్తుగా చూస్తే అవి నిజంగా కోతులేనా? లేక బంతులా? అని డౌట్ వస్తుంది.
ప్రపంచంలోనే అత్యంత బుల్లి కోతులుగా రికార్డుల్లో స్థానం కొట్టేసేందుకు ఈ రెండు ఇంచుల కోతులు సిద్ధంగా ఉన్నాయి. పుట్టీ పుట్టగానే జూలో సందడి సందడి చేసేస్తున్నాయి. యూకేలోని చెస్టర్ జూలో పుట్టిన కవల కోతులు.. కేవలం రెండు అంగుళాలు మాత్రమే. బరువు కూడా కేవలం 10 గ్రాములు. అవి ఎంత క్యూట్‌గా ఉన్నయో ఈ వీడియోలో చూడండి…
చూశారుగా..ఈ కోతుల గురించి తెలుసుకోవల్సిందే. యూకేలోని చెస్టర్ జూలో ప్రపంచంలోనే అత్యంత చిన్న సైజులో ఉండే కోతులు నివసిస్తున్నాయి. ఇటీవల మూడు, నాలుగేళ్ల వయస్సు గల జాయ్, బాల్డ్రిక్ అనే కోతులు ఈ కవల కోతులకు జన్మనిచ్చాయి. అంతకంటే చిన్నగా కనిపించే ఈ కోతుల్ని చూస్తుంటే కళ్లు తిప్పుకోలేం..మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంది.
పుట్టిన కొద్దిరోజుల్లో ఈ బుజ్జి కోతులు చాలా యాక్టీవ్‌గా సందడి చేసేస్తున్నాయి. ఈ కోతి పిల్లలు చాలా చిన్నవిగా ఉండటంతో ఇది మరోసరికొత్త రికార్డ్ అని జూ నిర్వాహకులు అంటున్నారు.