Javelin Missile : రష్యా.. దమ్ముంటే రా.. యుక్రెయిన్ చేతిలో పవర్‌ఫుల్ మిస్సైల్స్

జావెలిన్(Javelin Missile) అనే చిన్నపాటి ట్యాంక్ విధ్వంసకర ఆయుధం యుక్రెయిన్ సైనికుల చేతిలో బ్రహ్మాస్త్రంగా మారింది.

Javelin Missile

Javelin Missile : రష్యా చేస్తున్న వైమానిక దాడులతో అల్లకల్లోలం అవుతున్న యుక్రెయిన్ కు పెద్ద భరోసా దొరికింది. ఇంతవరకు రష్యా యుద్ధ విమానం వస్తుందంటే భయపడిన యుక్రెయిన్ కు ఇప్పుడు.. దమ్ముంటే.. రా..తేల్చుకుందాం.. అంటూ సవాల్ విసిరిసే పరిస్థితి వచ్చేసింది. అమెరికా పంపిన చిన్న ఆయుధాలు యుక్రెయిన్ సైన్యానికి ఇప్పుడు కొండంత ధైర్యాన్ని ఇచ్చాయి. ఆ ఆయుధాలే జావెలిన్, స్టింగర్ మిస్సైల్స్.

రష్యా సైన్యం దండయాత్రతో 9 రోజులుగా యుక్రెయిన్ లో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. రష్యా బలగాలను ధీటుగా ఎదుర్కొనేందుకు యుక్రెయిన్ సైన్యం భీకరంగా పోరాడుతోంది. ప్రపంచ దేశాలు మొండి చేయి చూపించినా యుక్రెయిన్ సేనలను దేశాధ్యక్షుడు ముందుండి నడిపిస్తూ రష్యా సైన్యాన్ని మట్టుబెడుతున్నారు. యుక్రెయిన్ దగ్గర అత్యాధునిక ఆయుధాలు, యుద్ధ సంపత్తి లేకపోయినా.. ఉన్న చిన్నపాటి ఆయుధాలతోనే వందలాది మంది రష్యా సైనికులను యుక్రెయిన్ సేనలు మట్టుబెడుతున్నాయి.

ప్రధానంగా జావెలిన్(Javelin Missile) అనే చిన్నపాటి ట్యాంక్ విధ్వంసకర ఆయుధం యుక్రెయిన్ సైనికుల చేతిలో బ్రహ్మాస్త్రంగా మారింది. సెయింట్ జావెలిన్ అంటూ ముద్దుగా పిలుచుకునే ఈ మైక్రో మిస్సైల్ లాంచర్ ను ఉపయోగించి రష్యాపై యుక్రెయిన్ పైచేయి సాధిస్తోంది. రష్యా బలగాలను ధీటుగా ఎదుర్కోంటోంది. సైనిక, రక్షణ పరికరాల కొనుగోలులో భాగంగా తొలిసారి 2018లో అమెరికా నుంచి యుక్రెయిన్ ఈ జావెలిన్ క్షిపణులను కొనుగోలు చేసింది. ఇక ఈ జావెలిన్ క్షిపణులతో 280 రష్యన్ సాయుధ వాహనాలను ధ్వంసం చేశారు యుక్రెయిన్ సైనికులు. 300 జావెలిన్ మిస్సైల్స్ ను ప్రయోగిస్తే అందులో 280 విజయవంతంగా రష్యన్ యుద్ధ ట్యాంకులను పేల్చివేసింది.

Stinger Missile : పవర్‌ఫుల్ స్టింగర్.. యుక్రెయిన్ చేతికి అమెరికా బ్రహ్మాస్త్రం

తక్కువ ఎత్తులో ఎగిరే విమానాలు, హెలికాప్టర్లను ఢీకొట్టే కెపాసిటీ ఈ జావెలిన్ సొంతం. ఈ జావెలిన్ మిస్సైళ్లకు 93శాతం హిట్ రేట్ ఉందంటే వాటి పవర్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. 2021 చివరిలో రష్యా ఆక్రమణకు ముందు పరిస్థితులు వేడెక్కడంతో రష్యన్ వేర్పాటువాదులపై ఈ జావెలిన్ మిస్సైల్ తోనే యుక్రెయిన్ దాడి చేసింది. 1980 చివరిలో అమెరికా రక్షణ సంస్థ రూపొందించిన ఈ తేలికపాటి యాంటీ ట్యాంక్ మిస్సైల్ లాంచర్ ఆయుధాన్ని సునాయసంగా ఎక్కడికైనా మోసుకెళ్లి శత్రుమూకలపై ఎక్కుపెట్టొచ్చు.

Ukraine Army Gets Powerful Javelin Missile

మినీ లాంచర్ అవసరం లేకుండానే ట్రిగ్గర్ సాయంతో మిస్సైల్ ను పేల్చవచ్చు. దీని బరువు చాలా తక్కువ. ఒకసారి లక్ష్యాన్ని గురి పెట్టి మిస్సైల్ ను సంధించిన తర్వాత జావెలిన్ ను పక్కనపడేసి సైనికులు మరెక్కడైనా దాక్కోవచ్చు. దీంతో శత్రువుల కంటపడకుండా ఒక చోటు నుంచి మరొక చోటుకి చేరుకోవచ్చు. జావెలిన్ మిస్సైల్ ను ప్రపంచంలోని అధునాతన పోర్టబుల్ యాంటీ ట్యాంక్ క్షిపణుల్లో ఒకటి. ఇది 5కిలోమీటర్ల వరకు లక్ష్యాన్ని చేధించగలదు. భయంకరమైన రష్యా సేనలను తిప్పికొట్టేందుకు ప్రస్తుతం యుక్రెయిన్ సైనికులు ఈ శక్తిమంతమైన జావెలిన్ మిస్సైల్ ను వాడుతున్నారు.

యుక్రెయిన్ బలగాలకు ఉపయోగపడుతున్న మరొక మిస్సైల్ స్టింగర్. ఇవి కూడా అచ్చం జావెలిన్ మిస్సైల్స్ ను పోలి ఉంటాయి. యుక్రెయిన్ సైనికుల చేతికిప్పుడు మేడిన్ అమెరికా స్టింగర్ మిస్సైల్ వచ్చేసింది. రష్యాను ఎదుర్కోవడానికి యుక్రెయిన్ కు సాయం చేస్తామన్న అమెరికా.. స్టింగర్ మిస్సైల్ ను పంపించింది. వీటితో వైమానిక దాడులను తిప్పికొడుతున్నారు.

Russia ukraine war : తొమ్మిది రోజుల్లో 9,166మంది రష్యా సైనికుల్ని అంతమొందించాం : యుక్రెయిన్

చేతిలో పట్టుకుని దాడి చేసేందుకు అనువుగా ఉండే ఈ మిస్సైల్.. అవసరమైతే గగనతలంలోనూ టార్గెట్ ఫిక్స్ చేస్తే ఫినిష్ చేసేస్తాయి. ఇప్పటివరకు రష్యా వైమానిక దాడులు చేస్తున్నా యుక్రెయిన్ గట్టిపోటీ ఇవ్వలేకపోతోంది. స్టింగర్ మిస్సైళ్ల రాకతో గగనతలంలో రష్యాను యుక్రెయిన్ మరింత నిలువరించే అవకాశం ఉంది.