Stinger Missile : పవర్ఫుల్ స్టింగర్.. యుక్రెయిన్ చేతికి అమెరికా బ్రహ్మాస్త్రం
ఇప్పటిదాకా ఒక లెక్క. ఇకపై మరో లెక్క అంటున్నారు యుక్రెయిన్ సైనికులు. వాళ్ల చేతికిప్పుడు మేడిన్ అమెరికా స్టింగర్ మిస్సైల్(Stinger Missile) వచ్చేసింది.

Stinger Missile
Stinger Missile : యుక్రెయిన్ బలగాలకు ఉపయోగపడుతున్న మరొక మిస్సైల్ స్టింగర్. ఇవి కూడా అచ్చం జావెలిన్ మిస్సైల్స్ ను పోలి ఉంటాయి. యుక్రెయిన్ రాజధాని కీవ్ వైపు రష్యా బలగాలు రాకుండా తిప్పికొడుతున్న సైన్యానికి గగనతల దాడులే ప్రమాదంగా మారాయి. అకస్మాత్తుగా వచ్చి
మిస్సైల్స్ ను కురిపించి పోతున్న రష్యా విమానాలను కట్టడి చేయలేకపోతోంది యుక్రెయిన్ సైన్యం. ఫలితం కీవ్ లో భారీ విధ్వంసం.
అయితే, ఇప్పటిదాకా ఒక లెక్క. ఇకపై మరో లెక్క అంటున్నారు యుక్రెయిన్ సైనికులు. వాళ్ల చేతికిప్పుడు మేడిన్ అమెరికా స్టింగర్ మిస్సైల్(Stinger Missile) వచ్చేసింది. రష్యాను ఎదుర్కోవడానికి యుక్రెయిన్ కు సాయం చేస్తామన్న అమెరికా.. స్టింగర్ మిస్సైల్ ను పంపించింది. వీటితో వైమానిక దాడులను తిప్పికొడుతున్నారు.
Russia Military : సైన్యంపై తప్పుడు ప్రచారం చేస్తే 15ఏళ్ల జైలు శిక్ష, రష్యా కొత్త చట్టం
స్టింగర్ మిస్సైళ్ల వల్ల రష్యా, యుక్రెయిన్ యుద్ధం మరింత భీకరంగా మారే అవకాశం ఉంది. యుక్రెయిన్ ఇంకా మెరుగ్గా పోరాడేందుకు అవకాశం ఉంది. చేతిలో పట్టుకుని దాడి చేసేందుకు అనువుగా ఉండే ఈ మిస్సైల్.. అవసరమైతే గగనతలంలోనూ టార్గెట్ ఫిక్స్ చేస్తే ఫినిష్ చేసేస్తాయి. ఇప్పటివరకు రష్యా వైమానిక దాడులు చేస్తున్నా యుక్రెయిన్ గట్టిపోటీ ఇవ్వలేకపోతోంది. స్టింగర్ మిస్సైళ్ల రాకతో గగనతలంలో రష్యాను యుక్రెయిన్ మరింత నిలువరించే అవకాశం ఉంది.
* స్టింగర్ మిస్సైల్ చాలా తేలికైనవి.
* వీటిలో పోర్టబుల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంటుంది.
* భుజంపై పెట్టుకుని ప్రయోగించవచ్చు.
* వీటి ద్వారా గ్రౌండ్ లెవెల్ లో సైన్యాన్ని మోహరించవచ్చు.
* గన్ పట్టుకున్నట్లు పట్టుకోవచ్చు.
* వీటి బరువు 10 కిలోలు.
* 8 కిలోమీటర్ల లోపు టార్గెట్ ఇస్తే సక్సెస్ ఫుల్ గా పని పూర్తి చేసేస్తాయి.
* భవనాల పైనుంచి కూడా గగనతలాన్ని టార్గెట్ చేయొచ్చు.(Stinger Missile)
* తక్కువ ఎత్తులో ఎగిరే విమానాలను, హెలికాప్టర్లను లక్ష్యంగా చేసుకుంటుంది.
* టార్గెట్ 11వేల అడుగుల ఎత్తులో ఉన్నా సమర్థవంతంగా పని చేయడం దీని స్పెషాలిటీ.
* 1981 నుంచి సేవలు అందిస్తున్న స్టింగర్ మిస్సైల్.
* సోవియట్-అప్ఘాన్ యుద్ధంలోనూ స్టింగర్ మిస్సైల్ దే కీ రోల్.
* సూపర్ సోనిక్ వేగం, అదే స్థాయిలో ఆక్టివ్ నెస్.
* కచ్చితమైన గైడ్ లైన్, కంట్రోలింగ్ సిస్టమ్ ఈ స్టింగర్ మిస్సైళ్ల సొంతం.
* క్రూయిజ్ మిస్సైళ్లు, ఫైటర్ జెట్లను ఈజీగా కూల్చివేసే కెపాసిటీ.
* ఒకటిన్నర మీటర్ పొడవు, దాదాపు 8 సెంటీమీటర్ల వెడల్పు ఉండే స్టింగర్ క్షిపణి.
Russia ukraine war : ‘బలి చేయటానికే ట్రైనింగ్‌లో ఉన్న మమ్మల్ని యుద్ధానికి పంపారు’ రష్యా సైనికుల ఆవేదన
యుక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగుతున్నాయి. కీలక నగరాలపై పట్టు బిగిస్తూ రష్యన్ సేనలు విరుచుకుపడుతున్నాయి. అయితే రష్యా సేనలకు ధీటుగా బదులిస్తున్నామని యుక్రెయిన్ సాయుధ బలగాలు స్పష్టం చేశాయి. ఇప్పటివరకూ 250 రష్యన్ ట్యాంకులను ధ్వంసం చేశామని, 10వేల మంది రష్యన్ సైనికులను మట్టుబెట్టామని యుక్రెయిన్ ఆర్మీ తెలిపింది.
రష్యా వైపు భారీ నష్టం వాటిల్లిందని.. 33 విమానాలు, 37 హెలీకాఫ్టర్లను కూల్చామంది. 939 సాయుధ క్యారియర్లను ధ్వంసం చేశామని, 60 ఫ్యూయల్ ట్యాంకులను పేల్చివేశామని, 18 యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్ వార్ఫేర్ను ధ్వంసం చేశామని వెల్లడించింది. జపోరిజియా అణు శక్తి కేంద్రాన్ని రష్యా దళాలు స్వాధీనం చేసుకున్నట్లు యుక్రెయిన్ అధికారులు తెలిపారు.