Ukraine Crisis : యుక్రెయిన్ నుంచి జనం తరలింపు, మిలిటరీ డ్రిల్ వీక్షించనున్న పుతిన్

యుక్రెయిన్, రష్యా మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకునే ఉన్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందోనని జనం టెన్షన్ పడుతున్నారు. అయితే తూర్పు యుక్రెయిన్ వేర్పాటు వాదులు, మాస్కో మద్దతుదారులు కీలక ప్రకటన..

Ukraine Crisis : యుక్రెయిన్ నుంచి జనం తరలింపు, మిలిటరీ డ్రిల్ వీక్షించనున్న పుతిన్

Russia Ukraine

Updated On : February 19, 2022 / 7:22 AM IST

Russia President Putin : యుక్రెయిన్, రష్యా మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకునే ఉన్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందోనని జనం టెన్షన్ పడుతున్నారు. అయితే తూర్పు యుక్రెయిన్ వేర్పాటు వాదులు, మాస్కో మద్దతుదారులు కీలక ప్రకటన చేశారు. తూర్పు యుక్రెయిన్ ప్రాంతాన్ని ఖాళీ చేస్తామంటున్నారు. రష్యాకు తమ ప్రాంతంలోని ప్రజలను తరలిస్తామని తెలిపారు. నిన్నటి నుంచి పరిస్థితి ఆందోళనకరంగా మారిందని…వెంటనే ఆ ప్రాంతం ఖాళీ చేయాలని నిర్ణయించారు. మహిళలు, చిన్నారులు, వృద్ధులను మొదట పంపిస్తామని…డోనెస్ట్‌ పీపుల్‌ రిపబ్లిక్‌ నేత డెనీస్ తెలిపారు. ఉక్రెయిన్ రాజధాని కివ్‌పై దాడి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు. యుక్రెయిన్ అధ్యక్షుడు కూడా యుద్ధానికి దిగే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయన్నారు డెనీస్.

Read More : Russia and Ukraine : యుక్రెయిన్‌‌లో నర్సరీ స్కూల్‌‌పై బాంబుల వర్షం

యుద్ధం మొదలైతే ఎంతో ప్రాణనష్టం తప్పదంటున్నారు. దాన్ని నివారించేందుకు ఆ ప్రాంతం విడిచిపెట్టి వెళ్లిపోవాల్సిందేని తూర్పు యుక్రెయిన్ వేర్పాటు వాదులు నిర్ణయించారు. వెంటనే ఖాళీ చేయాలని స్థానికులందరికీ విజ్ఞప్తి చేశామన్నారు. అలాగే ప్రతి పురుషుడు ఆయుధం కలిగి ఉండాలని…తమను తాము రక్షించుకునేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు వేర్పాటువాదులు. అయితే తూర్పు యుక్రెయిన్‌ నుంచి వచ్చే వారిని తమ దేశంలోకి అనుమతించింది రష్యా. వారు ఉండేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అలాగే వంద యూరోలను వారి కోసం కేటాయించింది రష్యా ప్రభుత్వం. రోస్టవ్‌ ప్రాంతంలో స్థానిక అధికారులు తమ కోసం ఆహారం, వైద్య సదుపాయం, ఇళ్లు సిద్ధం చేసి ఉంచారని వేర్పాటువాది ఒకరు తెలిపారు. ఇదిలా ఉంటే…ర‌ష్యా సైన్యం మ‌ళ్లీ మిలిటరీ డ్రిల్ నిర్వహించబోతోంది. ఇటీవల బెలార‌స్‌లో సైనిక డ్రిల్‌ నిర్వహించిన ర‌ష్యా సైన్యం.. మ‌రోసారి ఆ డ్రిల్స్‌ను నిర్వహించ‌బోతోంది.

Read More : Russia Tension : యుక్రెయిన్‌‌లో ఉద్రిక్తతలు.. కేంద్రం కీలక నిర్ణయం

వ్యూహాత్మక డ్రిల్స్‌లో భాగంగా చేపడుతున్న ఈ కార్యక్రమాన్ని… అధ్యక్షుడు పుతిన్ ప్రత్యక్షంగా వీక్షించ‌నున్నారు. ఇందులో భాగంగా బాలిస్టిక్ తో పాటు క్రూయిజ్ మిస్సైళ్లను కూడా పరీక్షించనుంది రష్యా సైన్యం. యుక్రెయిన్ స‌రిహ‌ద్దుల్లో ఉద్రిక్తతలు నెలకొన్న నేప‌థ్యంలో.. ర‌ష్యా ఈ డ్రిల్స్‌ నిర్వహిస్తుండటం.. పుతిన్ వీక్షించనుండటంతో మ‌రింత ఉత్కంఠ రేపుతోంది. శనివారం చేపట్టే మిలిటరీ డ్రిల్స్‌పై క్లారిటీ ఇచ్చారు రష్యా అధ్యక్షుడు పుతిన్. ఈ డ్రిల్స్ పూర్తిగా రక్షణాత్మకమైనవని, ఎవరికీ ముప్పు తలపెట్టే యోచనతో చేస్తున్నవి కావని చెప్పారు. అయితే.. యుక్రెయిన్.. ఒప్పందాలను ఉల్లంఘిస్తోందని అన్నారు. యుక్రెయిన్‌, నాటో వల్ల ముప్పు పెరుగుతోందని ఆరోపించిన పుతిన్‌.. దౌత్యానికి తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. రష్యా-యుక్రెయిన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న క్రమంలో అమెరికాతో చర్చలు జరిపేందుకు సిద్ధమైంది రష్యా. ఈ మేరకు రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రో ప్రతిపాదించిన తేదీలకు అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్​ అంగీకరించారు. అయితే…యుక్రెయిన్​పై రష్యా దాడి చేయొద్దన్న షరతుతోనే అగ్రరాజ్యం ఈ చర్చలకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఒకవేళ రష్యా మాటతప్పితే దౌత్య విధానాలను సీరియస్​గా తీసుంటామని హెచ్చరించింది.