Russia Tension : యుక్రెయిన్‌‌లో ఉద్రిక్తతలు.. కేంద్రం కీలక నిర్ణయం

రష్యా యుక్రెయిన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. రష్యా బలగాలను ఉపసంహరించుకున్నప్పటికీ ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో యుక్రెయిన్‌లో ఉన్న భారతీయులు...

Russia Tension : యుక్రెయిన్‌‌లో ఉద్రిక్తతలు.. కేంద్రం కీలక నిర్ణయం

India

India And Ukraine : యుక్రెయిన్‌లో ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా కేంద్రం నిర్ణయం తీసుకుంది. భారత్-ఉక్రెయిన్‌ల మధ్య విమాన రాకపోకలు, సిటింగ్ పరిమితిని కేంద్ర పౌర విమానయాన శాఖ తొలగించింది. ఇక డిమాండ్‌కు తగ్గట్టుగా విమానాలు, చార్టర్ విమానాలు నడపడానికి కేంద్రం అనుమతించింది. భారత్-ఉక్రెయిన్‌ మధ్య ప్రయాణికుల సంఖ్య పెరగడంతో విమానాల సంఖ్య కూడా పెంచాలని భారతీయ విమానయాన సంస్థలు కేంద్రాన్ని కోరాయి. దీంతో పౌర విమానయాన శాఖ- విదేశాంగ శాఖ సమన్వయంతో విమాన ప్రయాణంపై ఉన్న ఆంక్షలను సులభతరం చేసింది.

Read More : ఉక్రెయిన్ సంక్షోభం.. మన వంటిల్లు ఇక భారమే.. కారణం ఇదే..!

రష్యా యుక్రెయిన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. రష్యా బలగాలను ఉపసంహరించుకున్నప్పటికీ ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో యుక్రెయిన్‌లో ఉన్న భారతీయులు స్వదేశానికి తరలి వస్తుండటంతో విమానాల రద్దీ పెరిగింది. దీంతో విమాన రాకపోకలు, సిటింగ్ విషయంలో ఇప్పటివరకున్న ఆంక్షలను సడలించాలని కేంద్రం నిర్ణయించింది. యుక్రెయిన్‌ అంటే మెడిసన్‌కు అడ్డా..! ఫీజ్ తక్కువ..! క్వాలిటీ ఎడ్యుకేషన్‌ ఎక్కువ.. ! ప్రపంచ ప్రఖ్యాత యూనివర్శిటీలకు పెట్టిన దేశం అది..! అందుకే ప్రతిఏడాది అక్కడికి వెళ్లి మెడిసన్‌ చదివే వారి సంఖ్య పెరుగుతూనే ఉంటుంది.

Read More : Russia – Ukraine: రష్యా – ఉక్రెయిన్ ఉద్రిక్తతలు భారత ఎంబసీ మరో ప్రకటన

భారత్‌ నుంచే కాదు ఇతర దేశాల నుంచి కూడా యుక్రెయిన్‌ వెళ్లి మెడిసన్‌ చదువుతుంటారు. అయితే ఇందులో భారతీయు విద్యార్థులు శాతమే ఎక్కువ. యుక్రెయిన్‌లో విద్యను అభ్యసించే ఇతర దేశాస్థుల్లో భారత్‌ నుంచే 24శాతం మంది ఉన్నారు. ఇక మెడిసన్‌తో పాటు డెంటల్‌, నర్సింగ్ కోర్సులకు కూడా యుక్రెయిన్‌లో డిమాండ్‌ ఎక్కువ. అందుకే ప్రతిఏడాది వేలాది మంది భారతీయ విద్యార్థులు యుక్రెయిన్‌ ఫ్లైట్‌ ఎక్కుతారు. దీంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విమానాల సంఖ్యపై ఆంక్షలను తొలగించింది. డిమాండ్‌కు అనుగుణంగా.. విమానాల సంఖ్య పెంచాలని విమానయాన సంస్థలకు ఆదేశాలు ఇచ్చారు. దీంతో యుక్రెయిన్‌లో ఉన్న భారతీయులు స్వదేశానికి తిరిగి వచ్చే అవకాశం ఏర్పడింది. దీంతో పాటు కరోనా కారణంగా విధించిన ఎయిర్ బబుల్ ఆంక్షలను కూడా ఎత్తేసింది.