India-Ukraine: యుద్ధం జరుగుతున్న వేళ.. భారత్ కు వచ్చిన ఉక్రెయిన్ మంత్రి

రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై భారత్ ఇప్పటికే పలుసార్లు స్పందించింది. చర్చల ద్వారానే సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించింది.

India-Ukraine: యుద్ధం జరుగుతున్న వేళ.. భారత్ కు వచ్చిన ఉక్రెయిన్ మంత్రి

India-Ukraine

Updated On : April 10, 2023 / 3:42 PM IST

India-Ukraine: ఉక్రెయిన్ (Ukraine)లో యుద్ధం జరుగుతున్న వేళ ఆ దేశ మంత్రి ఎమిన్ జాపరోవా (Emine Dzhaparova) ఇవాళ భారత దేశానికి  వచ్చారు. న్యూఢిల్లీలో ఆమె నాలుగు రోజుల పాటు పర్యటించనున్నారు. ఆమె ఉక్రెయిన్ విదేశాంగ శాఖ మొట్టమొదటి డిప్యూటీ మంత్రి. భారత విదేశాంగ శాఖ (MEA) ప్రతినిధి సంజయ్ వర్మతో ఎమిన్ జాపరోవా చర్చలు జరపనున్నారు. యుద్ధం జరుగుతున్న వేళ ఆమె భారత్ కు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది.

భారత్ తో ఆమె ధ్వైపాక్షిక చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్ లో యుద్ధం, భారత్-ఉక్రెయిన్ మధ్య సత్సంబంధాలు, అంతర్జాతీయ సమస్యలు వంటి అంశాలపై చర్చలు జరపనున్నట్లు సమాచారం. భారత విదేశాంగ శాఖ సహాయ మంత్రి మీనాక్షి లేఖితో కూడా ఎమిన్ జాపరోవా సమావేశంలో పాల్గొననున్నారు.

అలాగే, జాతీయ భద్రతా ఉప సలహాదారు విక్రమ్ మిస్రీతోనూ ఆమె సమావేశం కానున్నారు. ఉక్రెయిన్ విదేశాంగ శాఖ మొట్టమొదటి డిప్యూటీ మంత్రి ఎమిన్ జాపరోవాకు భారత్ లోకి స్వాగతం పలికామని, ఇరు దేశాల ధ్వైపాక్షిక సంబంధాలు, సహకారంపై చర్చించామని భారత విదేశాంగ శాఖ (MEA) ప్రతినిధి సంజయ్ వర్మ ట్విట్టర్ లో తెలిపారు.

ఆమె పర్యటన విజయవంతం అవుతుందని ఆశిస్తున్నామని చెప్పారు. కాగా, రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై భారత్ ఇప్పటికే పలుసార్లు స్పందించింది. చర్చల ద్వారానే సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించింది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ తో ప్రధాని మోదీ పలుసార్లు ఫోనులో మాట్లాడారు.


Ghost Husband : దెయ్యం భర్త నుంచి విడాకులు కోరుతున్న భార్య.. వైరల్ అవుతున్న వింత కథ