హఫీజ్ కు ఐరాస షాక్

హఫీజ్ కు ఐరాస షాక్

Un Rejects Hafiz Saeeds Plea Removal List Banned Terrorists 5598

Updated On : May 14, 2021 / 12:16 PM IST

జమాత్ ఉద్ దవా(JUD) ఉగ్రసంస్థ అధినేత,2008 ముంబై ఉగ్రదాడి సూత్రధారి హఫీజ్ సయీద్ కు యునైటెడ్ నేషన్స్(UN)షాక్ ఇచ్చింది. నిషేధిత ఉగ్రవాదుల జాబితా నుంచి తన పేరు తొలగించాలని సయీద్ చేసిన విజ్ణప్తిని ఐరాస తిరస్కరించింది.సయీద్ పై నిషేధానికి ఐరాస 1267 ఆంక్షల కమిటీ ఆమోదం తెలిపింది.సయీద్ పై నిషేధం ఎత్తివేతను భారత్,ఫ్రాన్స్,బ్రిటన్ వ్యతిరేకించగా పాక్ మాత్రం మౌనంగా ఉండిపోయింది.

భారత్ లో అనేక ఉగ్రదాడులకు పాల్పడిన సయీద్ ఉగ్ర కార్యకలాపాలపై భారత్ బలమైన సాక్ష్యాలను సమర్పించిందని,దీంతో నిషేధాన్ని కొనసాగిస్తూ ఐరాస ఈ నిర్ణయం తీసుకుందని ఓ సీనియర్ అధికారి తెలిపారు. సయాద్ ప్రస్తుతం పాక్ లో గృహనిర్బంధంలో కొనసాగుతున్నాడని తెలిపారు. ఆంక్షల కమిటీ నిబంధనల ప్రకారం నిషేధిత జాబితాలోని వ్యక్తులు,సంస్థల ఆస్తులను సభ్యదేశాలను జప్తుచేయాలి.ప్రభుత్వం నుంచి వీరికి ఎటువంటి సహాయం అందకూడదు. అంతేకాకుండా వీరిపై ప్రయాణ నిషేధం కూడా కొనసాగుతుంది