అద్భుతం : 27 ఏళ్ల నాడు ఫ్రీజ్ చేసిన పిండం.. ఆడబిడ్డకు జననం !!

US baby born from 27-year-old broken record : వైద్యశాస్త్రంలో కనీవినీ ఎరుగని ఓ అద్భుతం జరిగింది..!ఎప్పుడో 27 ఏళ్ల క్రితం ఫ్రీజ్ చేసిన పిండం.. ఇప్పుడు ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ఆ పిండం గత అక్టోబర్ 26న ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. బహుశా ఇటువంటి అద్భుతం ఎప్పుడూ ఎక్కడా జరిగి ఉండదు. కృత్రిమ పద్ధతిలో జరిగిన ప్రక్రియలో ఎప్పుడో 27ఏళ్లనాడు ప్రీజ్ చేసిన పిండంనుంచి ఆడబిడ్డ జన్మించింది.
వివరాల్లోకి వెళితే..అమెరికాకు చెందిన టీనా, బెన్ గిబ్సన్ దంపతులకు ఆడ శిశువు పుట్టింది. అక్టోబర్ 26వ తేదీన ఆ పాప పుట్టిందని టెన్నిసిసీ వర్సిటీ పరిశోధకులు చెప్పారు. ఆ బేబీకి మొల్లి ఎవరెట్ గిబ్సన్ అని పేరు పెట్టారు. దంపతులకు పాపం పుట్టం పెద్ద విశేషం కాదు. కానీ ఎప్పుడో 27 ఏళ్ల క్రితం అంటే..1992లో మొల్లి పిండాన్ని ఫ్రీజ్ చేశారు.
అయితే 27 ఏళ్ల పాటు శీతలీకరణ దశలో (ఫ్రీజ్ చేసి ఉంచిన) ఉన్న ఆ పిండాన్ని.. కృత్రిమ పద్ధతిలో టీనా గర్భాశయానికి ఎక్కించారు. బేబీ మొల్లి గిబ్సన్ కన్నా ముందు కూడా టీనా దంపతులు ఇదే తరహాలో ఆడ శిశువు జన్మనిచింది. 2017లో పుట్టిన ఆ అమ్మాయి పేరు ఎమ్మా వ్రెన్ గిబ్సన్. అయితే ఎమ్మా కోసం 24 ఏళ్ల క్రితం నాటి పిండాన్ని వినియోగించారు.
మొల్లి, ఎమ్మాలు జన్యుపరంగా తోడబుట్టినవాళ్లే అంటే అక్కాచెల్లెళ్లులు అవుతారు. ఈ ఇద్దరి పిండాలను 1992లో డోనేట్ చేశారు. అప్పటి నుంచి ఒకే దగ్గర ఆ పిండాలను ఫ్రీజ్ చేశారు. అద్దె పిండాలతో ఇద్దరు అమ్మాయిలకు జన్మనిచ్చిన టీనా.. మొల్లి గిబ్సన్ కన్నా ఒక ఏడాది ముందు జన్మించడం విశేషం.
ఎంబ్రియో అడాప్షన్ విధానం గిబ్సన్ దంపతులకు కొత్త జీవితాన్ని ఇచ్చింది. ఐవీఎఫ్ చికిత్స చేసుకునే వారు.. అదనంగా పిండాలను దానం చేయాల్సి ఉంటుంది. అయితే పిల్లలు కాని వారు..ఆ పిండాలను దత్తత తీసుకున్నారు.
కానీ అప్పటి వరకు ఆ పిండాలను మైనస్ ఉష్ణోగ్రతల్లో ఫ్రీజ్ చేస్తారు. అలా 27 ఏళ్ల క్రితం ఫ్రీజ్ చేసిన పిండం ఆడబిడ్డకు జన్మనివ్వటం ప్రపంచ రికార్డుగా చరిత్ర క్రియేట్ చేసింది. వైద్య చరిత్రలో ఇదొక అద్భుతంగా నిలిచింది.