Tasmanian Tiger DNA
Tasmanian Tiger DNA : ఎప్పుడో అంతరించిపోయిన.. ఇప్పుడు అంతరించిపోతున్న అరుదైన జీవజాతులకు మళ్లీ ప్రాణం పోసే పనిలో పడ్డారు శాస్త్రవేత్తలు. ఆ లిస్టులో మంచు ఏనుగులతో పాటు టాస్మానియన్ టైగర్ కూడా ఉంది. పేరులో టైగర్ ఉందని ఇది ఆ జాతికి చెందినది కాదు… ఇది ఒక అరుదైన తోడేలు.. కానీ ఒంటిపై పులి చారలు కనిపిస్తాయి. ఇది అంతరించిపోవడంతో.. ఆస్ట్రేలియా అడవుల్లోని జీవావరణ వ్యవస్థలో సమతుల్యం పూర్తిగా దెబ్బతింది. అందుకే దీన్ని మళ్లీ పుట్టించాలని ప్రయత్నాలు చేస్తున్నారు.
సాధారణంగా అంతరించిపోయిన జీవాలను మళ్లీ పుట్టించడం అసాధ్యం. జెనెటిక్ సైంటిస్టులు మాత్రం అసాధ్యాన్ని సుసాధ్యం చేయొచ్చని అంటున్నారు. వేల సంవత్సరాల క్రితం అంతరించిపోయిన జీవులకు తిరిగి ప్రాణం పోయొచ్చని చెబుతున్నారు. ఇప్పటికే మంచు యుగం నాటి భారీ ఏనుగుల్ని మళ్లీ సృష్టించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ ఏనుగులను హైబ్రిడ్ విధానంలో తిరిగి భూమిపై సృష్టించేందుకు ఓ భారీ సైంటిఫిక్ ప్రాజెక్టు కూడా మొదలైంది. దాంతో పాటు శాస్త్రవేత్తల ఫోకస్ టాస్మానియన్ టైగర్ పైనా పడింది. ఈ జంతు జాతిని మళ్ళీ పుట్టించే దిశగా ప్రయోగాలు కూడా మొదలయ్యాయి. ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ యూనివర్సిటీ పరిశోధకులు, అమెరికాలోని కోలోస్సల్ బయోసైన్సెస్ అనే సంస్థ సంయుక్తంగా అంతరించిపోయిన టాస్మానియన్ టైగర్ జాతికి తిరిగి జీవం పొసే ప్రయోగంలో నిమగ్నమయ్యాయి. విచిత్రం ఏంటంటే మంచు ఏనుగులతో పాటు టాస్మానియన్ టైగర్ తిరిగి పుట్టించే ప్రాజెక్ట్‌లు రెండింటిని చేపట్టింది ఒకే కంపెనీ. అదే అమెరికాకు చెందిన బయోసైన్స్ అండ్ జెనెటిక్స్ కంపెనీ కోలోస్సల్.
Also read : Woolly Mammoths DNA : వేల సంవత్సరాల క్రితం అంతరించిపోయిన భారీ ఏనుగులను తిరిగి సృష్టించే యత్నాలు..
టాస్మానియన్ టైగర్ అనేది ఒక తోడేళ్ల జాతి. ఇది చాలా అరుదైనది. ఇవి 1930వ దశకంలో అంతరించినప్పటి నుంచి అడవుల్లో జీవావరణ వలయం దెబ్బతింది. దీని కారణంగా అడవుల్లోని జంతువుల ఆహార చక్రం దెబ్బతింది. ఆస్ట్రేలియా అడవుల్లో పరిస్థితులు అస్తవ్యస్తంగా మారాయి. ఎన్నో జంతువులు దారితప్పి.. అడవుల నుంచి నేరుగా ఏజెన్సీ గ్రామాలపైకి దండెత్తుతున్నాయి. అక్కడ పంటలను సర్వనాశనం చేస్తున్నాయి. అందుకే ప్రపంచ ప్రఖ్యాత కోలోసల్ బయోసైన్సెస్ ఈ జాతిని క్లోన్ చేసేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది. టాస్మానియన్ టైగర్ డి-ఎక్స్‌టింక్షన్‌ను ప్రారంభించినట్లు ప్రకటించింది. దీనికోసం మూడు ప్రయోగశాలల్లో 35 మంది ప్రముఖ శాస్త్రవేత్తల బృందం పనిచేస్తోంది. ఈ ప్రయోగాల్లో భాగంగా 1930ల్లో ల్యాబ్‌లో భద్రపర్చిన టాస్మానియన్ టైగర్ క్షీరదాల పిండాలను.. టాస్మానియన్ టైగర్ నుంచి సేకరించిన డీఎన్ఏ జన్యువులను వినియోగించి ల్యాబ్ లో సరికొత్త సృష్టి చేయబోతున్నారు. అలాగే జీనోమ్ ఇంజినీరింగ్ సాయంతో టాస్మానియన్ టైగర్ డీఎన్‌ఏలో పలు మార్పులు చేయనున్నారు.
Also read : రాజసాల నజరానా : ఏనుగుల ఊరు ‘హాథీగావ్’ ప్రత్యేకతలు
నిజానికి 1999లోనే శాస్త్రవేత్తలు థైలాసిన్ DNA నుండి టాస్మానియన్ పులిని క్లోన్ చేయడానికి ప్రయత్నించారు. కానీ ఆ డీఎన్‌ఏ పాడైపోయింది. అది అప్పట్లో వర్కవుట్ కాలేదు. అందుకే ఇప్పుడు జన్యుపరంగా ఇంజనీరింగ్ చేసిన వన్యప్రాణాలును తిరిగి భూమ్మీదకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు.