Woolly Mammoths DNA : వేల సంవత్సరాల క్రితం అంతరించిపోయిన భారీ ఏనుగులను తిరిగి సృష్టించే యత్నాలు..

10,000 ఏళ్ల క్రితం మూవీలో భారీ ఏనుగులు గుర్తున్నాయా..! అవి పరిగెడుతుంటే భూకంపం వస్తుందేమో అనిపిస్తుంది. అలాంటి ఏనుగులు ఇప్పుడు లేవు. అవి సుమారు 10 వేల సంవత్సరాల క్రితమే అంతరించిపోయాయి. అలాంటి వాటిని మళ్లీ సృష్టించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. డీఎన్‌ఏ ఎడిటింగ్‌ పద్ధతి ద్వారా వూలీ మమోత్‌లను మళ్లీ పుట్టించేందుకు ట్రై చేస్తున్నారు.

Woolly Mammoths DNA : వేల సంవత్సరాల క్రితం అంతరించిపోయిన భారీ ఏనుగులను తిరిగి సృష్టించే యత్నాలు..

Bioscience Firm Colossal Plan to Bring Back Woolly Mammoths

Woolly Mammoths DNA genomic history : 10,000 బీసీ మూవీలో భారీ ఏనుగులు గుర్తున్నాయా..! అవి పరిగెడుతుంటే భూకంపం వస్తుందేమో అనిపిస్తుంది. అలాంటి ఏనుగులు ఇప్పుడు లేవు. అవి సుమారు 10 వేల సంవత్సరాల క్రితమే అంతరించిపోయాయి. అలాంటి వాటిని మళ్లీ సృష్టించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. డీఎన్‌ఏ ఎడిటింగ్‌ పద్ధతి ద్వారా వూలీ మమోత్‌లను మళ్లీ పుట్టించేందుకు ట్రై చేస్తున్నారు. దీని కోసమే ఏకంగా 15 లక్షల డాలర్లు సమీకరించారు. ఇంతకీ వూలీ మమోత్‌లను తిరిగి సృష్టించడం సాధ్యమేనా ? డీఎన్‌ఏ ఎడిటింగ్‌ పద్ధతితో వేల ఏళ్ల క్రితమే అంతరించిపోయిన జీవులను మళ్లీ పుట్టించొచ్చా ?

ఆఫ్రికన్‌ ఏనుగులు చాలా పెద్దవిగా ఉంటాయి. వీటి పేరు చెబితేనే వెన్నులో వణుకు పుడుతుంది. వాటిని దూరం నుంచి చూడ్డానికి కూడా భయమేస్తుంది. వీటికన్నా ఎన్నో రెట్లు పెద్దవి, బలమైనవి వూలీ
మమోత్‌లు. ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే ఇవి ఇప్పుడున్న ఏనుగులకు పూర్వీకులన్నమాట. అలాంటి ఏనుగుల ముందు మనం చీమల కంటే చిన్నగా కనిపిస్తాం. బలిష్టంగా కనిపిస్తూ ఒంటినిండా జూలుతో మంచు యుగంలో భూమిపై సంచరించిన ఏనుగులివి. యూరప్, ఉత్తర అమెరికాతో­పాటు ఆసియాలోని మంచు ప్రాంతాల్లో వూలీ మమోత్‌లు ఎక్కువగా నివసించేవి. మమోత్‌లలో మగవి సుమారు 12 అడుగుల ఎత్తు ఉండేవి. ఆడవి వాటికన్నా కొంచెం చిన్నగా ఉండేవి. వాటి మెలితిరిగిన దంతాలే సుమారు 16 అడుగుల పొడవు ఉండేవి. వాటికి ఉన్న ఊలు వెంట్రుకలు సుమారు 3 అడుగుల పొడవు ఉండేవి. మంచు యుగాంతంలో అంటే సుమారు 10 వేల ఏళ్ల క్రితం ఇవి పూర్తిగా అంతరించిపోయాయి. అసలు ఇదంతా ఇప్పుడెందుకు అంటే… ఎప్పుడో 10వేల సంవత్సరాల క్రితం పూర్తిగా అంతరించిపోయిన వాటిని ఇప్పుడు మళ్లీ పుట్టించాలని ట్రై చేస్తున్నారు.

జురాసిక్‌ పార్క్‌ సినిమాలో అంతరించిపోయిన డైనోసార్లను మళ్లీ పుట్టిస్తారు. ఇప్పుడు వూలీ మమోత్‌లను కూడా మళ్లీ సృష్టించాలని ప్రయత్నిస్తున్నారు. దీనికోసం అమెరికాకు చెందిన ప్రముఖ సంస్థ కొలోస్సల్‌ బయోసైన్సెస్‌ గట్టి ప్రయత్నాలే చేస్తోంది. ఈ ప్రాజెక్ట్‌ కోసం ఏకంగా 15 లక్షల డాలర్లు వెచ్చిస్తున్నారంటే ఎంతలా ఫోకస్ పెట్టారో అర్థం చేసుకోవచ్చు. డీఎన్‌ఏ ఎడిటింగ్‌ పద్ధతిలో తిరిగి ఈ వూలీ మమోత్‌లను సృష్టించాలన్నది ప్లాన్. వచ్చే 15 ఏళ్ల పాటు ఈ ప్రాజెక్ట్‌ కోసమే పూర్తిగా సమయం కేటాయించనున్నారు. ఎప్పుడో అంతరించిపోయిన మమోత్‌లను తిరిగి ఎలా సృష్టిస్తారన్నది కొలోస్సల్‌ బయోసైన్సెస్‌ సంస్థ బయటకు చెప్పకపోయినా… డీఎన్‌ఏ ఎడిటింగ్‌ పద్ధతిలోనే అది సాధ్యమనే వాదనలు వినిపిస్తున్నాయి. సింపుల్‌గా చెప్పాలంటే వూలీ మమోత్‌లకు దగ్గరి పోలికలు ఉండే 99 శాతం డీఎన్‌ఏను కలిగి ఉండే ఏనుగుల డీఎన్‌ఏను క్రమంగా మార్చుకుంటూ వెళ్తారు. ఒకవేళ ఈ ప్రాసెస్ వర్కవుట్ కాకపోతే.. మమోత్‌ని పోలిన అండాలను ల్యాబ్‌లో తయారు చేసి.. వాటిని ఏనుగుల గర్భంలో ప్రవేశపెడతారు.

ఎప్పుడో అంతరించిపోయిన జీవులను ప్రతిసృష్టి చేయాలనుకోవడం వెనుక కారణాలు చాలానే ఉన్నాయి. ఏటా ఆర్కిటిక్ ప్రాంతంలో మంచుకొండలు కరిగిపోతూ ఉన్నాయి. దీనికి భూతాపమే కారణం
సాధారణంగా భూమిపై అత్యధికంగా కార్బన్, మీథేన్‌లను పట్టి ఉంచిన పర్మాఫ్రాస్ట్‌ బలహీనపడితే అది భూ వాతావరణంలోకి భారీ స్థాయిలో కార్బన్‌ డై ఆక్సైడ్‌, మీథేన్‌ వాయువులను విడుదల చేస్తుంది. ఇదే జరిగితే మానవాళి ఉనికే ప్రశ్నార్థకంగా మారుతుంది. ఈ ముప్పు నుంచి గట్టెక్కాలంటే అప్పుడెప్పుడో అంతరించిపోయిన ఆర్కిటిక్‌ జంతువులను మళ్లీ ప్రతిసృష్టి చేయాల్సిందే ! వాటిని
ప్రతిసృష్టి చేసి మంచు ప్రాంతాలకు తరలిస్తే మన సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. అది ఎలాగంటే… భారీ బరువు ఆకారం ఉన్న వూలీ మమోత్‌లు ఆర్కిటిక్‌లో తిరగడం వల్ల అక్కడి మంచు పొరల లోపలి భాగం గట్టి పడుతుంది. ఫలితంగా పర్మాఫ్రాస్ట్‌లో చల్లదనం శాశ్వతంగా ఉండిపోయింది. అంతేకాదు అక్కడ భూతాపం కారణంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు కూడా పూర్తిగా తగ్గుతాయి.దీనికోసమే ఇప్పుడు వూలీ మమోత్‌లను సృష్టించాలని చూస్తున్నారు.