Ilhar Omar: ఇల్హాన్ ఒమర్ పర్యటనకు మేము డబ్బులు ఇవ్వలేదు, అది అనధికారిక పర్యటనే: స్పష్టం చేసిన అమెరికా విదేశాంగ
అమెరికా విదేశాంగశాఖ తెలిపిన వివరాలు ప్రకారం అసలు ఇల్హర్ ఒమర్ పాక్ పర్యటన అధికారికంగా జరగలేదని..ఆ పర్యటనకు అమెరికా ప్రభుత్వం స్పాన్సర్ చేయలేద

Ilhan
Ilhar Omar: అమెరికా కాంగ్రెస్ చట్ట సభ్యురాలు, ఇల్హాన్ ఒమర్ పాకిస్తాన్ పర్యటన అంతర్జాతీయంగా పలు అనుమానాలకు తావిస్తుంది. ఇటీవలే పాకిస్తాన్ లో ప్రభుత్వం మారిన నేపథ్యంలో భారత్ – పాక్ మధ్య మరోసారి చిచ్చు పెట్టేందుకే ఇల్హాన్ ఒమర్ పాక్ పర్యటనకు వచ్చారా? అనే సందేహాలు తలెత్తుతున్నాయి. ఎందుకంటే..అమెరికా విదేశాంగశాఖ తెలిపిన వివరాలు ప్రకారం అసలు ఇల్హాన్ ఒమర్ పాక్ పర్యటన అధికారికంగా జరగలేదని..ఆ పర్యటనకు అమెరికా ప్రభుత్వం స్పాన్సర్ చేయలేదని అమెరికా విదేశాంగశాఖ ప్రతినిధి నెడ్ ప్రైస్ ప్రకటించారు. ఒమర్ పర్యటన పై కొందరు జాతీయ అంతర్జాతీయ మీడియా ప్రతినిధులు అమెరికాలోని ఆమె కార్యాలయాన్ని సంప్రదించగా..పర్యటన వివరాలు తమకు తెలియదని, ఒక వేళ తెలిస్తే మీడియాకు తెలియజేస్తామని ఒమర్ కార్యాలయ డిజిటల్ డైరెక్టర్ మరియు ప్రెస్ సెక్రటరీ జాక్లిన్ రోజర్స్ సమాధానం ఇచ్చారు.
ఇల్హాన్ ఒమర్ పర్యటన వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నించిన అంతర్జాతీయ మీడియా ప్రతినిధుల్లో ఒక పాక్ ప్రతినిధి కూడా ఉండగా వారికి సైతం ఇదే సమాధానం రావడం గమనార్హం. కాగా పాక్ పర్యటనకు వచ్చిన యూఎస్ కాంగ్రెస్ సభ్యురాలు ఇల్హాన్ ఒమర్..పాకిస్తాన్ ప్రెసిడెంట్ సహా..మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, పాక్ పార్లమెంట్ సభ్యులను కలుసుకుని ఫోటోలు దిగారు. వారిని కలుసుకున్న అనంతరం ఇల్హాన్ ఒమర్..పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోనూ పర్యటించి భారత ఆగ్రహాన్ని చవిచూశారు. అయితే ఒమర్ పర్యటన అధికారికమే అని భావిస్తున్న తరుణంలో..అసలు విషయం తెలిసింది. అమెరికా ప్రభుత్వం ఇల్హాన్ పర్యటనకు ఏర్పాట్లు చేయలేదని..పర్యటనపై కనీసం ఆమె కార్యాలయ సిబ్బందికి సైతం సమాచారం లేదని స్పష్టం అయింది.
Also read:America: ఆ దేశంపై ఆధారపడటం ఆపేయండి.. భారత్‌కు సూచించిన అమెరికా..
మరి ఇటీవలే(లాక్ డౌన్ కి కొన్ని రోజుల ముందు) US Congress కు ఎన్నికైన ఇల్హాన్ ఒమర్ పాకిస్తాన్ కు ఎందుకు వచ్చింది? PoKలో ఎందుకు పర్యటించింది? అనే విషయాలపై విశ్లేషకులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అమెరికా చట్ట సభ్యులను..పూర్తి స్పాన్సర్షిప్ తో తమ దేశానికి ఆహ్వానించుకునే హక్కు విదేశాలకు ఉంటుంది. వాటిలో భారత్, పాక్ కూడా ఉన్నాయి. ఈక్రమంలో పాకిస్తానే ఇల్హాన్ పర్యటనకు స్పాన్సర్ చేసినట్లు “ఇండియా పోస్ట్” ప్రచురించింది. అయితే సోమాలియాలో పుట్టి అమెరికా చట్టసభకు ఎన్నికైనంత మాత్రాన ఇల్హాన్ ఒమర్ పాకిస్తాన్ – భారత్ సంబంధాలపై కలగజేసుకునే అధికారం ఉందా? ఒక వైపు అఫ్గానిస్తానున్ను ఒంటరి చేసి తాలిబన్ దురాక్రమణతో చేతులెత్తసిన అమెరికా..మరో వైపు ప్రపంచం గుర్తించేలా అఫ్గాన్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న తాలిబన్లపై పాకిస్తాన్ ఇటీవల దాడులు చేసిన ఘటనలపై ఇల్హాన్ ఎందుకు స్పందించలేదని అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు, నిపుణులు ప్రశ్నిస్తున్నారు.
Also read:Number plate : బాబోయ్.. నెంబర్ ప్లేట్ ధర రూ. 70కోట్లు.. అక్కడంతేనట..
ఇవన్నీ పక్కన బెడితే ఇటీవల అమెరికా పర్యటనకు వెళ్లిన భారత విదేశాంగ మంత్రి ప్రొఫసర్ జైశంకర్..అమెరికా చర్యలపై బాహాటంగానే విమర్శలు గుప్పించారు. రష్యా యుక్రెయిన్ యుద్ధంపై అమెరికా విధించిన ఆంక్షలపై భారత్ స్పందించక పోవడం..అమెరికాలో మానవహక్కుల ఉల్లంఘన వంటి అంశాలను అంతర్జాతీయ మీడియా వేదికగా జైశంకర్ అమెరికాపై విమర్శలు గుప్పించారు. దీంతో డిఫెన్సెలో పడిన అమెరికానే ఇలా ఇల్హాన్ ఒమర్ రూపంలో భారత్ పై అక్కసు వెళ్లగక్కుతుందని అనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే ఈ మొత్తం వివాదంలో కేంద్ర బిందువుగా నిలిచిన ఇల్హాన్ ఒమర్..పాక్ నుంచి తిరిగి అమెరికా చేరుకున్న అనంతరం మీడియా ప్రశ్నలకు స్పందించేందుకు సైతం అందుబాటులోకి రాకపోవడం గమనార్హం.
US congresswomen @IlhanMN visited LOC (A dividing line) between Kashmiris,very meaningful visuals,about two flags from Chakothi bridge AJK pic.twitter.com/iid8JvV3Ve
— Faisal Ali Shah (@FaisalzUpdates) April 21, 2022