ట్రంప్ చెప్పిందే జరుగుతోంది.. 10లక్షలు దాటిన కరోనా కేసులతో మొదటి దేశంగా అమెరికా.. 59వేల మరణాలు!

  • Published By: sreehari ,Published On : April 29, 2020 / 05:56 AM IST
ట్రంప్ చెప్పిందే జరుగుతోంది.. 10లక్షలు దాటిన కరోనా కేసులతో మొదటి దేశంగా అమెరికా.. 59వేల మరణాలు!

Updated On : April 29, 2020 / 5:56 AM IST

యునైటెడ్ స్టేట్స్‌లో కరోనావైరస్ బారిన పడిన వారి సంఖ్య ఒక మిలియన్ దాటింది. మరణాలు దాదాపు 59,000 వరకు పెరిగాయి. అయినప్పటికీ కొన్ని రాష్ట్రాలు, దేశాలు కరోనా కేసులు, మరణాల మధ్యనే తమ ఆర్థిక వ్యవస్థలను తిరిగి తెరిచే ప్రక్రియను ప్రారంభించాయి. ‘బాధితుల కోసం మేం ప్రార్థిస్తూనే ఉన్నాం. ఇలాంటివి ఎన్నడూ చూడాలేదు. కరోనాపై విజయం సాధిస్తాము. మేము బలంగా తిరిగి వస్తున్నాము’ అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్ వద్ద పేచెక్ ప్రొటెక్షన్ ప్రోగ్రాంపై చేసిన వ్యాఖ్యల సందర్భంగా చెప్పారు. 

కరోనావైరస్ కేసుల్లో ప్రపంచంలోనే మొట్టమొదటి దేశంగా అమెరికా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా 3.1 మిలియన్ కేసులలో ఇది మూడింట ఒక వంతుగా చెప్పవచ్చు. దాదాపు 59,000 మరణాలతో, 213,000 ప్రపంచ మరణాలలో నాల్గోవ వంతులో అమెరికా కూడా ఉంది. కాలిఫోర్నియాలో, గవర్నర్ గావిన్ న్యూసోమ్ తన రాష్ట్రాన్ని దశలవారీగా తిరిగి ప్రారంభించినట్టు తెలిపారు. రోగనిరోధక శక్తి లేదా వ్యాక్సిన్ వచ్చేవరకు  ఈ ప్రక్రియను కొనసాగుతూనే ఉంటుందన్నారు. వాస్తవా డేటాపై ఆధారంగా అవసరమైన చర్యలను చేపడతామన్నారు. 

కాలిఫోర్నియాలో ఇప్పటివరకు కరోనావైరస్ కారణంగా 1,800 మందికి పైగా మరణించారు. పాఠశాలలు, కళాశాలలు జూలై-ఆగస్టులో ప్రారంభమవుతాయని ఆయన అన్నారు. కాలిఫోర్నియా వాషింగ్టన్ స్టే-ఎట్-హోమ్ ఆర్డర్ విధించిన మొదటి రెండు రాష్ట్రాలలో ఒకటి. ఇప్పుడు దేశంలోని 330 మిలియన్ల జనాభాలో 95 శాతానికి పైగా ప్రజలు ఇంటి వద్దే ఉన్నారు. టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబోట్ రాష్ట్రం మొదటి దశను తిరిగి ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. Tennessee సోమవారం రెస్టారెంట్లను తిరిగి తెరవడానికి అనుమతించింది. ఈ వారం తరువాత రిటైల్ అవుట్ లెట్లు తమ వ్యాపారాలను తిరిగి ప్రారంభించనున్నాయి. Pennsylvania మే 3 నుంచి మూడు దశల్లో అన్నింటిని తెరవనున్నట్టు ప్రకటించింది.

దక్షిణ కెరొలినా, ఒరెగాన్, ఓక్లహోమా, ఒహియో వంటి రాష్ట్రాలు తమ ఆర్థిక వ్యవస్థలను దశలవారీగా తిరిగి ప్రారంభిస్తున్నట్లు ప్రకటించాయి. Utah రాష్ట్రం మంగళవారం సడలింపు ఆంక్షలను ప్రకటించింది . నివాసితులకు మాస్క్ లను సరఫరా చేసింది. న్యూయార్క్‌లో, యుఎస్‌లో కరోనావైరస్ వ్యాప్తికి కేంద్రంగా, అనవసర వ్యాపారాలు మే 15 వరకు మూసి వేయాలని ఆదేశించాయి. న్యూయార్క్‌తో పాటు న్యూజెర్సీ, కనెక్టికట్, పెన్సిల్వేనియా, డెలావేర్,  రోడ్ ఐలాండ్  మసాచుసెట్స్‌తో సహా ఇతర రాష్ట్రాల్లో ఇదే తరహా ప్రకటన జారీ అయింది. 

ప్రపంచంలో మరే దేశం చేయని రీతిలో అమెరికా ఎక్కువ పరీక్షలు చేసిందని ట్రంప్ అన్నారు. ఇంకా మరిన్ని ఎక్కువ కేసులను చూడబోతున్నాం. ఎందుకంటే చాలా ఎక్కువ పరీక్షలు చేస్తున్నాము. అందరికంటే రెట్టింపు’ అని ట్రంప్ అన్నారు. ‘నేను నిపుణులు చెప్పింది విన్నాను. అదే నేను మీకు చెప్తాను. నేను చేయకూడదని నిపుణులు భావించినప్పటికీ ఆ పని నేను చేశాను. మన దేశ మన సరిహద్దులను మూసివేసాను.

యుఎస్ పౌరులే కాదు.. చైనీయులు సైతం రాకుండా నిషేధించాను’ అని ట్రంప్ చెప్పుకొచ్చారు. యుఎస్ పౌరులను కూడా వదిలిపెట్టలేదని వారిని కూడా నిశితంగా పరిశీలించినట్టు ట్రంప్ వివరణ ఇచ్చారు. అమెరికాలో కరోనా కేసులు పది లక్షలకుపైగా నమోదు అవుతాయని, లక్షల్లో మరణాలు నమోదు అవుతాయని ట్రంప్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. వైట్ హౌస్ మాత్రం దాదాపు 2 లక్షల మంది కరోనా సోకి మరణించే అవకాశం ఉందని అంచనా వేసింది.