US Journalist: రష్యా బలగాల చేతిలో ప్రాణాలు కోల్పోయిన అమెరికన్ జర్నలిస్టు

రష్యా దాడులకు బ్రెంట్ రెనౌడ్ (51) బలైపోయాడు. యుక్రెయిన్ లో రష్యన్ ఆర్మీ గన్ తో కాల్చడంతో స్పాట్ లో చనిపోయాడు. ఆదివారం ఈ ఘటన జరిగినట్లు Kyivప్రాంత పోలీసు అధికారి ఆండ్రీ నెబిటోవ్..

US Journalist: రష్యా బలగాల చేతిలో ప్రాణాలు కోల్పోయిన అమెరికన్ జర్నలిస్టు

Us Journalist

Updated On : March 13, 2022 / 8:44 PM IST

US Journalist: రష్యా దాడులకు బ్రెంట్ రెనౌడ్ (51) బలైపోయాడు. యుక్రెయిన్ లో రష్యన్ ఆర్మీ గన్ తో కాల్చడంతో స్పాట్ లో చనిపోయాడు. ఆదివారం ఈ ఘటన జరిగినట్లు Kyivప్రాంత పోలీసు అధికారి ఆండ్రీ నెబిటోవ్ వెల్లడించారు. ఇర్పిన్ ప్రాంతంలో రష్యా బలగాలు బ్రెంట్ ను హతమార్చగా మరో జర్నలిస్టును తీవ్రంగా గాయపరిచిందని తెలిపారు.

ఇంటర్నేషనల్ మీడియాకు చెందిన జర్నలిస్టులను సైతం హతమారుస్తున్నారు. యుక్రెయిన్‌పై రష్యా బలగాల అకృత్యాలను చూపిస్తున్నందుకు ఈ దారుణానికి పాల్పడ్డారు అని నెబిటోవ్ ఫేస్ బుక్ లో పేర్కొన్నారు.

వేలాది మంది సైనికులతో సహా.. అత్యాధునిక ఆయుధాలు, యుద్ధ విమానాలు రష్యా సరిహద్దుల్లోని నాటో దేశాలకు చేరుకుంటున్నాయని.. కొంచెం జాగ్రత్తగా ఉండాలని వార్నింగ్ ఇచ్చారు బైడెన్‌. ఇప్పటికే ఆ దేశాల్లో అమెరికా బలగాల కదలికలు మొదలయ్యాయి.

Read Also: ఇండియన్ ఎంబస్సీ తరలింపు.. ఫోకస్ మార్చిన రష్యా

మొత్తానికి నాటో గుట్టు చప్పుడు కాకుండా యుక్రెయిన్‌కు ఆయుధాలు అందిస్తూ యుద్ధంలో నిలిచేలా చేస్తుంటే.. రష్యా మాత్రం యుక్రెయిన్‌ నగరాలపై బాంబుల వర్షం కురిపిస్తూనే ఉంది. ఈ యుద్ధం ఆగాలంటే రష్యా లక్ష్యమైనా నెరవేరాలి.. పుతిన్‌ మనసైనా మారాలి. యుక్రెయిన్‌తో రష్యా రాజీకైనా రావాలి.