Dallas Museum Of Art : వీడెవడండి బాబూ.. ప్రియురాలితో గొడవ.. రూ.40 కోట్లు ఫసక్ చేశాడు

ప్రియురాలితో గొడవపడిన ఓ యువకుడు చేసిన పని ఏంటో తెలిస్తే దిమ్మ తిరిగిపోవాల్సిందే. ప్రియురాలితో గొడవ కారణంగా కోపంతో ఊగిపోయిన అతగాడు ఏకంగా రూ.40 కోట్లు ఫసక్ చేశాడు.

Dallas Museum Of Art : వీడెవడండి బాబూ.. ప్రియురాలితో గొడవ.. రూ.40 కోట్లు ఫసక్ చేశాడు

Dallas Museum Of Art

Updated On : June 7, 2022 / 12:46 AM IST

Dallas Museum Of Art : ప్రియురాలితో గొడవపడిన ఓ యువకుడు చేసిన పని ఏంటో తెలిస్తే విస్తుపోవాల్సిందే. దిమ్మ తిరిగిపోవాల్సిందే. ప్రియురాలితో గొడవ కారణంగా కోపంతో ఊగిపోయిన అతగాడు ఏకంగా రూ.40 కోట్లు ఫసక్ చేశాడు.

అసలేం జరిగిందంటే.. అతడి పేరు బ్రియాన్ హెర్నాండెజ్. వయసు 21ఏళ్లు. ఇతగాడు అమెరికాలోని డల్లాస్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్ లోకి చొరబడ్డాడు. అక్కడ అరుదైన, విలువైన కళాఖండాలను ధ్వంసం చేశాడు. ఇతడు ధ్వంసం చేసిన కళాఖండాల విలువ ఎంతో తెలుసా? అక్షరాల రూ.40 కోట్లు.

డబ్బులు అనుకుని కొండచిలువలు ఉన్న సంచి దొంగిలించారు

సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు బ్రియాన్ ను అదుపులోకి తీసుకున్నారు. ఎందుకయ్యా ఇలా చేశావ్ అని అడగ్గా.. ఆ యువకుడు చెప్పిన సమాధానం విని వారు షాక్ అయ్యారు. తనకు గర్ల్ ఫ్రెండ్ పై ఎంతో ప్రేమ ఉందని బ్రియాన్ చెప్పాడు. అయితే ఇటీవల తన ప్రియురాలితో అతడు గొడవపడ్డాడట. ఇది తట్టుకోలేకపోయాయని, ఆ కోపంలోనే ఇలా చేశానని బ్రియాన్ చెప్పుకొచ్చాడు.

పోలీసులు బ్రియాన్ అదుపులోకి తీసుకున్నారు. మ్యూజియం ప్రవేశ ద్వారం వెలుపల రాత్రిపూట బ్రియాన్ కుర్చీతో ఉన్నట్లు సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. ఆరవ శతాబ్దపు గ్రీకు విగ్రహం, 450 BC నాటి కుండతో సహా విలువైన కళాఖండాలను, ప్రదర్శనలను ధ్వంసం చేయడం సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయింది.

Japanese Man: కుక్కగా మారిపోయేందుకు రూ.12లక్షలు ఖర్చు పెట్టిన జపాన్ వ్యక్తి

బ్రియాన్ ధ్వంసం చేసిన వాటిలో చాలా విలువైనవి, అరుదైనవి, పురాతన కళాఖండాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. అంతేకాకుండా ” కైలిక్స్ హెరాకిల్స్ మరియు నెమియన్ లయన్” విగ్రహం (దీని ఖరీదు రూ.77 లక్షలు) కూడా దెబ్బతింది. మొత్తం నష్టం విలువ సుమారు 5.2 మిలియన్ డాలర్లు(రూ.40.37 కోట్లు) ఉంటుందని అంచనా వేశారు. ఈ సంఘటనతో తాము షాక్ కి గురయ్యామని, అయితే ఎవరికీ హాని చేయనందుకు మేము బ్రియాన్ కు కృతజ్ఞతలు తెలుపుతున్నాము” అని మ్యూజియం నిర్వహకులు చెప్పారు.

Pixee Fox : ఇదేందయ్యా ఇది, ఏడా సూడలే..! ఆమె నడుము చూస్తే షాక్ అవ్వాల్సిందే.. రూ.77లక్షలు ఖర్చు చేసి మరీ ఇలా..

పారిస్‌లోని లౌవ్రే మ్యూజియంలో.. ప్రపంచ ప్రఖ్యాతి పొందిన మోనాలిసా పెయింటింగ్ విధ్వంసానికి ప్రయత్నించిన కొద్దిరోజులకే ఈ సంఘటన జరిగింది. ఒక సందర్శకుడు పెయింటింగ్ రక్షణ గాజుపై కేక్ విసిరాడు. కానీ కళాఖండం దెబ్బతినలేదు. దీంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.