Japanese Man: కుక్కగా మారిపోయేందుకు రూ.12లక్షలు ఖర్చు పెట్టిన జపాన్ వ్యక్తి

జపాన్‌కు చెందిన ఓ వ్యక్తి తన జీవితకాల కల నెరవేర్చుకునేందుకు రూ.12లక్షలు ఖర్చు చేశాడు. జంతువులా కనిపించాలని ప్రయత్నం చేసి.. తాను దిగిన ఫొటోలను ట్విట్టర్ లో పోస్టు చేయించుకున్నాడు.

Japanese Man: కుక్కగా మారిపోయేందుకు రూ.12లక్షలు ఖర్చు పెట్టిన జపాన్ వ్యక్తి

Japanease Man

Updated On : May 25, 2022 / 6:28 PM IST

Japanese Man: జపాన్‌కు చెందిన ఓ వ్యక్తి తన జీవితకాల కల నెరవేర్చుకునేందుకు రూ.12లక్షలు ఖర్చు చేశాడు. జంతువులా కనిపించాలని ప్రయత్నం చేసి.. తాను దిగిన ఫొటోలను ట్విట్టర్ లో పోస్టు చేయించుకున్నాడు. ట్రాన్సపర్మేషన్ తర్వాత ఆ వ్యక్తి కొల్లీ అనే బ్రీడ్ డాగ్‌గా కనిపిస్తున్నాడని జెప్పైట్ అనే ప్రొఫెషనల్ ఏజెన్సీ కన్ఫమ్ చేసింది.

స్థానిక జపనీస్ న్యూస్ అవుట్‌లెట్ news.mynavi ప్రకారం , జెప్పెట్ చలనచిత్రాలు, కమర్షియల్ యాడ్‌లు, వినోద సౌకర్యాల కోసం పెద్ద సంఖ్యలో శిల్పాలను అందిస్తుంది. టీవీలో కనిపించే దుస్తులు, జపాన్‌లోని ప్రసిద్ధ మస్కట్ పాత్రల దుస్తులను కూడా ఉత్పత్తి చేస్తుంది.

మొత్తం కాస్ట్యూమ్ ₹ 12 లక్షల (2 మిలియన్ యెన్) కంటే ఎక్కువ ఖర్చవుతుందని అంచనా. కాకపోతే దీనిని తయారు చేయడానికి 40 రోజుల సమయం పట్టింది.

Read Also: వామ్మో ఈ కుక్క ఎత్తు చూశారా?: ప్రపంచంలోనే ఎతైన కుక్కగా గిన్నిస్ రికార్డు

టోకో news.mynaviతో కూడా మాట్లాడాడు. “అతను కోలీగా మారడానికి కారణమేంటంటే, ఆ దుస్తులు ధరించినప్పుడు నిజంగా అలాగే అనిపిస్తుంది. ఆ నాలుగు కాళ్ల జంతువులు, అందంగా ఉంటాయి. అందులోనూ దగ్గరగా ఉండే పెద్ద జంతువు అయితే బాగుంటుందని భావించి, అది రియలిస్టిక్ మోడల్‌గా ఉండాలని అడిగా. అందుకే కుక్కగా మారాలని నిర్ణయించుకున్నా”

కాకపోతే కుక్క దుస్తువుల్లో ఉన్నప్పుడు అవయవాలను స్వేచ్ఛగా కదిలించడానికి ఉండదు. “పరిమితులు ఉంటాయి, ఎక్కువగా కదిలిస్తే, అది కుక్కలా కనిపించదని అతను చెబుతున్నాడు.

టోకో తన సొంత YouTube ఛానెల్‌లో తాను కుక్క దుస్తులలో ఉన్న వీడియోను పోస్టు చేసి మీరు నన్ను గుర్తించడం చాలా కష్టమని పేర్కొన్నాడు.