Tallest Dog: వామ్మో ఈ కుక్క ఎత్తు చూశారా?: ప్రపంచంలోనే ఎతైన కుక్కగా గిన్నిస్ రికార్డు

పెంపుడు కుక్కల్లో ఎతైన కుక్కగా అమెరికాకు చెందిన "జుయస్(Zeus)అనే కుక్క గిన్నిస్ బుక్ లో స్థానం సంపాదించింది.

Tallest Dog: వామ్మో ఈ కుక్క ఎత్తు చూశారా?: ప్రపంచంలోనే ఎతైన కుక్కగా గిన్నిస్ రికార్డు

Dog

Tallest Dog: మనిషికి మొదటి మిత్రుడిగా కుక్కను చెప్పుకుంటారు. యజమానుల పట్ల ఎంతో విశ్వాసంతో ఉండే కుక్కలు..ఒక్కసారి అలవాటు పడ్డాయంటే జీవితాంతం యజమానితోనే ఉంటాయి. అందుకే చాలామంది ప్రజలు తమకు తోడుగా ఉంటుందని కుక్కలను పెంచుకుంటుంటారు. అయితే కుక్కల్లో కూడా అనేక జాతులు ఉన్నాయి. జాతులను బట్టి వాటి ఆకారాలు కూడా వేరుగా ఉంటాయి. ఇక విషయానికొస్తే పెంపుడు కుక్కల్లో ఎతైన కుక్కగా అమెరికాకు చెందిన “జుయస్(Zeus)అనే కుక్క గిన్నిస్ బుక్ లో స్థానం సంపాదించింది. కేవలం రెండేళ్ల వయసున్న “జుయస్(Zeus)” 3 అడుగుల 5 అంగుళాల ఎత్తుతో ప్రపంచంలోనే ఎతైన మగ కుక్కగా నిలిచిందంటూ గిన్నిస్ బుక్ ప్రతినిధులు తెలిపారు.

Also read:Ukraine – Russia: యుక్రెయిన్ లో అణ్వాయుధాలను మోహరించే ఉద్దేశం లేదు: రష్యా

అంటే ఒక సాధారణ మనిషి జుయస్ పక్కన నిలుచుంటే.. అది ఒక చిన్నపాటి గుర్రంలాగే ఉంటుంది. అమెరికాలోని టెక్సాస్ రాష్ట్ర బెడ్ ఫోర్డ్ కి చెందిన బ్రిటనీ డేవిస్ కుటుంబం ఈ కుక్కను పెంచుకుంటుంది. అమెరికన్ గ్రేట్ డేన్ జాతికి చెందిన ఈ కుక్కలు సాధారణంగా ఐదేళ్ల కాలానికి గాని ఇంత ఎత్తు పెరగవు. అయితే జుయస్ మాత్రం రెండేళ్లకే మూడు అడుగులు పెరిగి..ప్రపంచంలో బ్రతికే ఉన్న ఎత్తైన కుక్కగా రెకార్డుకెక్కింది.

తమ పెంపుడు కుక్క జుయస్ గిన్నిస్ రికార్డు సాధించడం పట్ల బ్రిటనీ డేవిస్ మాట్లాడుతూ..తాము ఎక్కడికెళ్లినా జుయస్ వెంట వచ్చినప్పుడు చుట్టూ ఉన్నవారు తమ కుక్కనే చూస్తూండేవారని..ఒకరకంగా కొందరు అప్పుడప్పుడు ఇది కుక్క, గుర్రమా అని కూడా అడుగుతుంటారని చెప్పుకొచ్చింది. ఇంత పెద్ద ఆకారం ఉన్నా..జుయస్ మాత్రం ఎంతో స్నేహంగా ఉంటుందని..స్థానిక మార్కెట్లోనూ కొందరు వ్యాపారాలు జుయస్ ను మచ్చిక చేసుకున్నట్లు డేవిస్ పేర్కొంది. ఆకారంలో పెద్దదైనా..జుయస్..తనతో పాటుగా ఉండే మరో మూడు ఆస్ట్రేలియన్ షెఫర్డ్, ఒక పిల్లితో సఖ్యంగా మెలుగుతుందని డేవిస్ చెప్పుకొచ్చింది.

Also read:Imran Khan: తనను తాను గాడిదతో పోల్చుకున్న ఇమ్రాన్.. సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తున్న వీడియో..