US Military Helicopter : అమెరికా సైనిక హెలికాప్టర్‌ కూలి ముగ్గురు మృతి.. 20 మందికి గాయాలు

ఈ ప్రమాదానికి కారణాలను గుర్తించే పనిలో నిమగ్నమైనట్లు డార్విన్ రొటేషన్ ఫోర్స్ ఒక ప్రకటనలో తెలిపింది. గతంలో ఈ రకం హెలికాప్టర్లు ఎక్కువగా ప్రమాదాలకు గురయ్యాయి.

US Military Helicopter : అమెరికా సైనిక హెలికాప్టర్‌ కూలి ముగ్గురు మృతి.. 20 మందికి గాయాలు

US Military Helicopter

USA: ఆస్ట్రేలియాలో జరుగుతున్న యుద్ధ విన్యాసాల్లో అమెరికాకు చెందిన హెలికాప్టర్ కూలిపోయింది. ఈ ఘటన మాల్విల్ ద్వీపం వద్ద చోటు చేసుకుంది. ఆస్ట్రేలియాలో ప్రిడెటర్ రన్ పేరిట యుద్ధ విన్యాసాలు జరుగుతున్నాయి. ఆస్ట్రేలియా, అమెరికా, పిలిప్పీన్స్, ఈస్ట్ తైమూర్, ఇండోనేషియాకు చెందిన 2500 సైనికులు దీనిలో పాల్గొన్నారు. ఆదివారం ఉదయం అమెరికా మెరైన్ విభాగానికి చెందిన ఎంవీ-22బీ ఓస్ర్పేకు చెందిన రెండు హెలికాప్టర్లు ఆస్ట్రేలియాలోని ఉత్తర డార్విన్ నుంచి 80 కిలో మీటర్లు దూరంలోకి తివి ద్వీపానికి బయలుదేరాయి.

Ukraine : యుక్రెయిన్ లో గాలిలో ఢీకొన్న రెండు శిక్షణా విమానాలు.. ముగ్గురు పైలెట్లు దుర్మరణం

వీటిల్లో ఒక హెలికాప్టర్ కూలిపోయింది. ఇందులో దాదాపు 23 మంది ఉన్నారు. ఈ ప్రమాదంలో ముగ్గురు మెరైన్స్ దుర్మరణం చెందారు. మరో 20 మంది గాయపడ్డారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం శకలాలను గుర్తించే కార్యక్రమం కొనసాగుతుంది. ఈ ప్రమాదానికి కారణాలను గుర్తించే పనిలో నిమగ్నమైనట్లు డార్విన్ రొటేషన్ ఫోర్స్ ఒక ప్రకటనలో తెలిపింది. గతంలో ఈ రకం హెలికాప్టర్లు ఎక్కువగా ప్రమాదాలకు గురయ్యాయి.