కరోనా కేసుల్లో చైనాను దాటేసిన అమెరికా

  • Published By: vamsi ,Published On : March 27, 2020 / 03:03 AM IST
కరోనా కేసుల్లో చైనాను దాటేసిన అమెరికా

Updated On : March 27, 2020 / 3:03 AM IST

అగ్రరాజ్యం అమెరికాలో కోవిడ్-19 కేసుల సంఖ్య కరోనా పుట్టిన దేశం చైనాను కూడా దాటేసింది. ప్రస్తుతం అమెరికాలో 83,500మంది కరోనావైరస్ బాధితులు ఉన్నారు. ప్రపంచంలో మరే దేశంలో ఇంతమంది బాధితులు లేరు.

జాన్ హాప్‌కిన్స్ యూనివర్సిటీ గణాంకాల ప్రకారం అమెరికాలో కరోనావైరస్ బాధితుల సంఖ్య చైనా, ఇటలీలను దాటేసింది. అయితే 1200 మరణాలతో ఇటలీ, చైనాల తర్వాత మూడోస్థానంలో నిలిచింది అమెరికా. కానీ, కరోనా సోకినవారిలో ఎక్కువ మంది చనిపోయే పరిస్థితిలోనే ఉన్నట్లు డాక్టర్లు చెబుతున్నారు. 

చైనాలో 81వేల 782 మందికి, ఇట‌లీలో 80 వేల 589 మందికి క‌రోనా వైర‌స్ సంక్ర‌మించగా..  చైనాలో ఇప్ప‌టి వ‌ర‌కు వైర‌స్ వ‌ల్ల 3291 మంది, ఇట‌లీలో 8215 మంది మ‌ర‌ణించారు. వైర‌స్ నియంత్ర‌ణ విష‌యంలో ట్రంప్ ప్ర‌భుత్వం విఫ‌ల‌ం అవ్వడంతో ఈ పరిస్థితి వచ్చిందంటూ ఆ దేశమే విమర్శలు గుప్పిస్తుంది. త్వ‌ర‌గానే దేశం మ‌ళ్లీ గాడిలో ప‌డుతుంద‌ని ట్రంప్ అంటున్నప్పటికీ, తీసుకుంటున్న చర్యలు మాత్రం చెత్తగా ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. 

దేశ‌వ్యాప్తంగా 5లక్షల 52వేల ప‌రీక్ష‌లు చేసిన‌ట్లు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఏప్రిల్ 12వ తేదీన‌, ఈస్ట‌ర్ సంద‌ర్భంగా అన్ని ఆంక్ష‌ల‌ను ఎత్తివేయాల‌నుకున్న‌ట్లు ట్రంప్ తెలిపారు. అయితే వైర‌స్ విస్తృతంగా ప్ర‌బ‌లుతుండడంతో ఆ ప్లాన్  బెదిసికొట్టేలా కనిపిస్తుంది.
 

Also Read | ఎవరూ పస్తులుండొద్దు : అన్నపూర్ణ కేంటీన్ల ద్వారా ఉచిత భోజనం సరఫరా