US Drone strike : సిరియాలో అమెరికా డ్రోన్ దాడి, ఇస్లామిక్ స్టేట్ నాయకుడి హతం

సిరియా దేశంపై అమెరికా తాజాగా డ్రోన్‌తో దాడి చేసింది. యూఎస్ సెంట్రల్ కమాండ్ తూర్పు సిరియాపై జరిపిన డ్రోన్ దాడిలో ఇస్లామిక్ స్టేట్ నాయకుడు ఉసామా అల్ మహాజిర్ హతం అయ్యాడు. అమెరికా ఎంక్యూ-9 డ్రోన్లతో జరిపిన దాడిలో ఉసామా అల్ మహాజర్ హతం అయ్యాడని యూఎస్ అధికారికంగా ప్రకటించింది....

US Drone strike : సిరియాలో అమెరికా డ్రోన్ దాడి, ఇస్లామిక్ స్టేట్ నాయకుడి హతం

US Drone strike

Updated On : July 10, 2023 / 8:09 AM IST

US Drone strike : సిరియా దేశంపై అమెరికా తాజాగా డ్రోన్‌తో దాడి చేసింది. యూఎస్ సెంట్రల్ కమాండ్ తూర్పు సిరియాపై జరిపిన డ్రోన్ దాడిలో ఇస్లామిక్ స్టేట్ నాయకుడు ఉసామా అల్ మహాజిర్ హతం అయ్యాడు. అమెరికా ఎంక్యూ-9 డ్రోన్లతో జరిపిన దాడిలో ఉసామా అల్ మహాజర్ హతం అయ్యాడని యూఎస్ అధికారికంగా ప్రకటించింది. సిరియాలో అనుమానిత ఐసిస్ కార్యకర్తలపై దాడులను వేగవంతం చేసింది. (US says it killed Islamic State leader)

Bengal Governor : బెంగాల్ ఎన్నికల హింసాకాండపై అమిత్ షాకు గవర్నర్ నివేదిక

ముస్లింల ఖలీఫాగా ప్రకటించుకున్న ఐఎస్ఐఎస్ మాజీ అధిపతి అబూబకర్ అల్ బాగ్ధాదీని యూఎస్ చంపింది. ఐఎస్ఐఎస్ నాయకులు విదేశాల్లో దాడులకు ప్రణాళిక వేసినట్లు యూఎస్ తెలిపింది. సిరియాలో తిరిగి తన నెట్ వర్క్ ను స్థాపించేందుకు యత్నిస్తున్న ఐసిస్ ఉగ్రవాదులను తాము లక్ష్యంగా చేసుకున్నామని యూఎస్ మిలటరీ కమాండర్లు చెప్పారు.

Punjab : అక్రమాస్తుల కేసులో పంజాబ్ మాజీ డిప్యూటీ సీఎం అరెస్ట్

ఇస్లామిక్ స్టేట్ 2014వ సంవత్సరంలో ఇరాక్, సిరియాలో మూడింట ఒక వంతును తన ఆధీనంలో ఉంచుకుంది. రెండు దేశాల్లో ఐసిస్ పరాజయం పాలైనప్పటికీ, దాని తీవ్రవాదులు తిరుగుబాటు దాడులను కొనసాగిస్తున్నారు. ఇస్లామిక్ స్టేట్ టాప్ కమాండర్లు తాలిబాన్ బలగాల చేతిలో హతమయ్యారు.