Bengal Governor : బెంగాల్ ఎన్నికల హింసాకాండపై అమిత్ షాకు గవర్నర్ నివేదిక

పంచాయతీ ఎన్నికల సందర్భంగా పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో జరిగిన హింసాకాండపై ఆ రాష్ట్ర గవర్నర్ సీవీ ఆనందబోస్ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు సోమవారం రహస్య నివేదిక సమర్పించారు. ఆదివారం రాత్రి కోల్ కతా నుంచి ఢిల్లీకి వచ్చిన బెంగాల్ గవర్నర్ సీవీ ఆనందబోస్ అమిత్ షాతో సమావేశమయ్యారు....

Bengal Governor : బెంగాల్ ఎన్నికల హింసాకాండపై అమిత్ షాకు గవర్నర్ నివేదిక

Bengal Governor submit poll violence report

Bengal Governor : పంచాయతీ ఎన్నికల సందర్భంగా పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో జరిగిన హింసాకాండపై ఆ రాష్ట్ర గవర్నర్ సీవీ ఆనందబోస్ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు సోమవారం రహస్య నివేదిక సమర్పించారు. ఆదివారం రాత్రి కోల్ కతా నుంచి ఢిల్లీకి వచ్చిన బెంగాల్ గవర్నర్ సీవీ ఆనందబోస్ అమిత్ షాతో సమావేశమయ్యారు. (Bengal Governor flies to Delhi) జులై 8వతేదీన బెంగాల్ పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఉత్తర 24 పరగణాలు, దక్షిణ 24 పరగణాలు, కూచ్ బెహార్ జిల్లాల్లో హింసాకాండ జరిగింది.

Bengal Panchayat elections : బెంగాల్ పంచాయతీ ఎన్నికల్లో 697 బూత్‌లలో రీ పోలింగ్

ఈ హింసాకాండ జరిగిన ప్రాంతాల్లో గవర్నర్ ఆనందబోస్ సందర్శించి సమీక్షించారు. ఈ హింసాకాండలో మృతుల కుటుంబాలను గవర్నర్ కలిసి మాట్లాడారు. ఎన్నికల్లో జరిగిన హింసాకాండలో 18 మంది మరణించిన ఘటనలు, 697 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహణ, బెంగాల్ రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితిపై గవర్నర్ అమిత్ షాకు సమర్పించిన నివేదికలో వివరించారు. (submit poll violence report to Amit Shah)

Punjab : అక్రమాస్తుల కేసులో పంజాబ్ మాజీ డిప్యూటీ సీఎం అరెస్ట్

బెంగాల్ పంచాయతీ ఎన్నికల పోలింగ్ మొత్తాన్ని రద్దు చేసి, తిరిగి తాజాగా పోలింగ్ జరపాలని బీజేపీ అధ్యక్షుడు జగన్నాథ్ ఛటోపాధ్యాయ డిమాండ్ చేశారు. బూత్ ల ఆక్రమణ, పోలింగ్ డబ్బాల లూటీ, రిగ్గింగ్, బీజేపీ ఎన్నికల ఏజెంట్లపై దాడులపై గవర్నరకు బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు.