ఉగ్రవాది మసూద్ పై ఎందుకంత ప్రేమ : చైనాకి అమెరికా లాస్ట్ వార్నింగ్

అమెరికా: వరల్డ్ మోస్ట్ వాంటెడ్ టెర్రిస్ట్, జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్ విషయంలో చైనా తీరుపై అగ్రరాజ్యం అమెరికా సీరియస్ అయ్యింది. చైనాకి వార్నింగ్ ఇచ్చినంత పని

  • Published By: veegamteam ,Published On : April 13, 2019 / 08:35 AM IST
ఉగ్రవాది మసూద్ పై ఎందుకంత ప్రేమ : చైనాకి అమెరికా లాస్ట్ వార్నింగ్

Updated On : April 13, 2019 / 8:35 AM IST

అమెరికా: వరల్డ్ మోస్ట్ వాంటెడ్ టెర్రిస్ట్, జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్ విషయంలో చైనా తీరుపై అగ్రరాజ్యం అమెరికా సీరియస్ అయ్యింది. చైనాకి వార్నింగ్ ఇచ్చినంత పని

అమెరికా: వరల్డ్ మోస్ట్ వాంటెడ్ టెర్రిస్ట్, జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్ విషయంలో చైనా తీరుపై అగ్రరాజ్యం అమెరికా సీరియస్ అయ్యింది. చైనాకి వార్నింగ్ ఇచ్చినంత పని చేసింది. మసూద్ అజార్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించడానికి చైనా అడ్డుపడుతోంది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలోని సభ్య దేశాలు ఓకే చెబుతున్నా.. చైనా మాత్రం తన వీటో పవర్ తో అజార్ ను ఆదుకుంటోంది. దీనిపై అమెరికా ఆగ్రహం వ్యక్తం చేసింది. అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్ దేశాలు చైనాకి అల్టిమేటం జారీ చేశాయి. అజార్ ను ఉగ్రవాదిగా ప్రకటించే విషయంలో ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఏప్రిల్ 23వ తేదీలోపు చెప్పాలని గడువు ఇచ్చాయి. లేని పక్షంలో చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశాయి. నిషేధానికి అడ్డుపుల్ల వేస్తున్న చైనాను ఈసారి మండలిలో దోషిగా నిలపాలని అమెరికా భావిస్తోంది.

UN భద్రతా మండలిలో తీర్మానాన్ని అధికారికంగా ప్రవేశపెట్టి, సభ్యదేశాల అభిప్రాయాలను కోరిన అనంతరం ఓటింగ్‌ నిర్వహించాలని అమెరికా నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఆంక్షల కమిటీలోని కొన్ని నిబంధనలను అడ్డం పెట్టుకుని కారణాలను తెలపడానికి నిరాకరిస్తున్న చైనాను ఈసారి ఎలాగైనా మండలిలో దోషిగా చూపాలని అమెరికా భావిస్తున్నట్లు సమాచారం.

పుల్వామా ఉగ్రదాడి తర్వాత అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని భారత్ డిమాండ్ చేసింది. దీనికి ప్రపంచ దేశాల నుంచి మద్దతు లభించింది. అజార్ ని టెర్రరిస్ట్ గా ప్రకటించాలని అమెరికా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌ సంయుక్తంగా యూఎన్ భద్రతా మండలిలో ప్రతిపాదించాయి. సాంకేతిక కారణాల పేరుతో ఈ ప్రతిపాదనకు చైనా అడ్డు పుల్ల వేసింది. ప్రతిపాదనను పరిశీలించడానికి తమకు సమయం కావాలని కోరింది. నిబంధనల ప్రకారం 6 నెలల వరకు దీన్ని UN సెక్యూరిటీ కౌన్సిల్ లో ప్రవేశపెట్టడం సాధ్యం కాదు. మరో సభ్య దేశం ఏదైనా అభ్యంతరం వ్యక్తం చేస్తే మరో 3 నెలల వరకు పొడిగిస్తారు. దీంతో మసూద్‌ విషయంలో అనుకూల వైఖరి ప్రదర్శిస్తున్న చైనా కుయుక్తులను పసిగట్టిన అమెరికా ప్రత్యామ్నాయ మార్గంలో అతన్ని నిషేధిత జాబితాలో చేర్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. అందులో భాగంగా బ్రిటన్‌, ప్రాన్స్‌తో కలిసి సరికొత్త తీర్మానాన్ని రూపొందించింది. దాన్ని మండలిలోని సభ్యదేశాలకు పంపించింది. దీంతో ఈ విషయంపై మార్చిలో మండలిలో చర్చలు ప్రారంభమయ్యాయి. చైనా తీరుపై సభ్య దేశాలు మండిపడ్డాయి. అజార్‌ విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని ఒత్తిడి పెంచాయి. తదుపరి కార్యాచరణ ప్రకారం ఏప్రిల్‌  23 తర్వాత మండలిలో చర్చ చేపడతారు. అనంతరం ఓటింగ్‌ నిర్వహించి..మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం.