US To Lift Travel Ban: ఆ ఎనిమిది ఆఫ్రికా దేశాలపై ప్రయాణ ఆంక్షలు ఎత్తివేత
ఒమిక్రాన్ కట్టడి కోసం దక్షిణ ఆఫ్రికాలోని 8 దేశాలపై విధించిన ప్రయాణ ఆంక్షలను ఎత్తివేయనున్నట్లు అమెరికా ప్రకటించింది. కొత్త సంవత్సరం నేపథ్యంలో ఈ నిర్ణయం

Usa (2)
US To Lift Travel Ban: ఒమిక్రాన్ కట్టడి కోసం దక్షిణ ఆఫ్రికాలోని 8 దేశాలపై విధించిన ప్రయాణ ఆంక్షలను ఎత్తివేయనున్నట్లు అమెరికా ప్రకటించింది. కొత్త సంవత్సరం నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు శ్వేతసౌధం తెలిపింది. మరోవైపు.. అగ్రరాజ్యంలో ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా విస్తరిస్తోంది.
తొలిసారిగా దక్షిణాఫ్రికాలో వెలుగులోకి వచ్చిన కోవిడ్ కొత్త వేరియంట్ “ఒమిక్రాన్” వేగంగా వ్యాప్తి చెందుతూ యూఎస్ సహా ప్రపంచ దేశాలను టెన్షన్ పెడుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఒమిక్రాన్ కట్టడి చర్యల్లో భాగంగా దక్షిణ ఆఫ్రికాలోని 8 దేశాలపై విధించిన ప్రయాణ ఆంక్షలను ఎత్తివేయనున్నట్లు శుక్రవారం వైట్ హౌస్ ప్రకటించింది. డిసెంబర్-31,2021 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని తెలిపింది.
కాగా, నవంబర్- 29న అమెరికా ప్రభుత్వం…..8 దేశాలు- దక్షిణాఫ్రికా, బోట్స్వానా, జింబాబ్వే, నమీబియా, లెసోతో, ఈస్వతిని, మొజాంబిక్, మాలావి దేశాలను ఇటీవల సందర్శించిన అమెరికాయేతరులను దేశంలోకి అమెరికా నిషేధించిన విషయం తెలిసిందే.
మరోవైపు,అమెరికాలో ఇటీవల భారీగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. వీటికి తోడు ఒమిక్రాన్ కూడా చాలా వేగంగా వ్యాప్తిస్తోంది. అయితే యూఎస్ లోని కొన్ని రాష్ట్రాల్లో 90శాతం కోవిడ్ కేసులకు ఒమిక్రాన్ వేరియంటే కారణమని ఆ దేశ అధికారులు తెలిపారు.
ALSO READ Londoners Infected COVID-19 : లండన్ లోని ప్రతి 10 మందిలో ఒకరికి కరోనా