Londoners Infected COVID-19 : లండన్ లోని ప్రతి 10 మందిలో ఒకరికి కరోనా

 అధికారిక అంచనాల ప్రకారం.. ఆదివారం లండన్‌లోని 10 మందిలో ఒకరు కరోనా వైరస్ బారిన పడినట్లు తెలుస్తోంది. కోవిడ్ కొత్త వేరియంట్ "ఒమిక్రాన్"వేగవంతమైన

Londoners Infected COVID-19 : లండన్ లోని ప్రతి 10 మందిలో ఒకరికి కరోనా

London2

Londoners Infected COVID-19 : అధికారిక అంచనాల ప్రకారం.. ఆదివారం లండన్‌లోని 10 మందిలో ఒకరు కరోనా వైరస్ బారిన పడినట్లు తెలుస్తోంది. కోవిడ్ కొత్త వేరియంట్ “ఒమిక్రాన్”వేగవంతమైన వ్యాప్తిని ఇది తెలియజేస్తోంది.

ఆఫీస్ ఫర్ నేషనల్ స్టాటిస్టిక్స్(ONS)రూపొందించిన రోజువారీ నమూనా అంచనాల ప్రకారం… ఆదివారం నాటికి 9.5 శాతం మంది లండన్ వాసులు కరోనా బారిన పడ్డారు. ఒమిక్రాన్ వేరియంట్ దేశవ్యాప్తంగా వ్యాపించడంతో బ్రిటన్ రికార్డు స్థాయిలో కొత్త కరోనావైరస్ కేసులను నమోదు చేసిన ఒక రోజు తర్వాత ఈ గణాంకాలు వచ్చాయి.

బ్రిటన్ లో బుధవారం రికార్డు స్థాయిలో భారీగా 1లక్షా 6వేల కోవిడ్ కేసులు నమోదుకాగా, గురువారం అంతకుమించి 1లక్షా 19వేల 789కోవిడ్ కేసులు బ్రిటన్ లో నమోదయ్యాయి. కోవిడ్ వ్యాప్తి బ్రిటన్ లో గతేడాది ప్రారంభమైనప్పటి నుంచి ఒక్క రోజులో దేశంలో నమోదైన కేసుల్లో ఇదే అత్యధికం.

గడిచిన వారం రోజుల్లో బ్రిటన్ లో భారీ కేసుల నమోదుకు ఒమిక్రాన్ వేరియంటే ముఖ్య కారణంగా తెలుస్తోంది. ONS తాజా రిపోర్ట్ ప్రకారం…డిసెంబర్ 13- 19 మధ్య ఇంగ్లాండ్‌లో 35 మందిలో ఒకరికి కరోనా సోకినట్లు తేలింది.

మరోవైపు,వైరస్ బారినపడ్డ కార్మికులు సెల్ఫ్ ఐసొలేట్ అవుతుండటంతో…అనేక పరిశ్రమలు మరియు రవాణా నెట్‌వర్క్‌లు తీవ్ర సిబ్బంది కొరతను ఎదుర్కొంటున్నాయి.

ALSO READ Hyderabad : హైదరాబాద్ కేపీహెచ్‌బీ లో ఉద్రిక్తత-భవన నిర్మాణం కోసం తీసిన గుంతలో పడి ముగ్గురు చిన్నారులు మృతి