Hyderabad : హైదరాబాద్ కేపీహెచ్‌బీ లో ఉద్రిక్తత-భవన నిర్మాణం కోసం తీసిన గుంతలో పడి ముగ్గురు చిన్నారులు మృతి

హైదరాబాద్ కేపీహెచ్‌బీ కాలనీ ఫోర్త్‌ఫేజ్‌లో విషాదం చోటు చేసుకుంది. భవన నిర్మాణం కోసం తీసిన గుంతలో పడి ముగ్గురు చిన్నారులు దుర్మరణం చెందారు.

Hyderabad : హైదరాబాద్ కేపీహెచ్‌బీ లో ఉద్రిక్తత-భవన నిర్మాణం కోసం తీసిన గుంతలో పడి ముగ్గురు చిన్నారులు మృతి

Three Girls Died

Hyderabad :  హైదరాబాద్ కేపీహెచ్‌బీ కాలనీ ఫోర్త్‌ఫేజ్‌లో విషాదం చోటు చేసుకుంది. భవన నిర్మాణం కోసం తీసిన గుంతలో పడి ముగ్గురు చిన్నారులు దుర్మరణం చెందారు. కేపీహెచ్‌బీ ఫోర్త్‌ఫేజ్‌లో నివసించే రమ్య(7), పర్వేజ్ సోఫియా(12), సంగీత(14)లు ఆర్టీయే కార్యాలయం సమీపంలో ఆడుకునేందుకు మరో ఇద్దరు  స్నేహితురాళ్లతో కలిసి వెళ్లారు. ఈ క్రమంలో సంగీత ప్రమాదవశాత్తు అక్కడ భవన నిర్మాణం కోసం తీసిన గుంతలో పడిపోయింది.

ఆమెను కాపాడే ప్రయత్నంలో రమ్య, సోఫియా కూడా నీటిలో మునిగిపోయారు. నేహా అనే బాలిక మాత్రం పక్కనే ఉన్న చెట్టు  కొమ్మను పట్టుకుని బయటకు వచ్చేసింది. ముగ్గురు బాలికలు నీటి గుంతలో మునిగి మృతి చెందారు. దీంతో మిగిలిన ఇద్దరూ భయంతో  పరిగెత్తుకు వెళ్లి స్ధానికులకు సమాచారం ఇచ్చారు. స్ధానికులు ద్వారా సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్ధలానికి వచ్చి సోఫియా, సంగీత,రమ్యల మృతదేహాలను బయటకు తీశారు.

Also Read : Online Cheating Gang : ఆన్‌లైన్ మోసాలకు పాల్పడుతున్న నేపాలి గ్యాంగ్ అరెస్ట్

ముగ్గురు బాలికలు మరణించటంతో వారి కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. గతంలోనూ ఇదే ప్రాంతంలో నిర్మాణం కోసం తీసిన గుంతలో పడి చిన్నారులు మృతి చెందటంతో స్ధానికులు ఆందోళన చేపట్టారు. భవన నిర్మాణం కోసం 10 ఏళ్ళ క్రితం ఈ గుంత తీసినట్లు  స్దానికులు ఆరోపించారు. గతంలో కూడా ఈ గుంతలో పడి కొందరు మరణించినట్లు తెలుస్తోంది.