Uber: ఉబర్ కారు డ్రైవర్ ఫోనుని లాక్కుని బయటకు పడేసిన యువతి.. ఫోన్ కోసం అతడు కారు దిగగానే..
ఫోన్ కోసం కారు నుంచి దిగిన ఉబర్ డ్రైవర్ రోడ్డుపైనే ఉండిపోయాడు. పోలీసులకు ఫోన్ చేసి జరిగిన విషయాన్ని చెప్పాడు. దీంతో..

Uber
US Woman: ఉబర్ కారు ఎక్కి విమానాశ్రయం వరకు ప్రయాణించాలనుకుంది ఓ యువతి. అయితే, కారును డ్రైవర్ మెల్లిగా నడిపిస్తున్నాడని ఆమెకు కోపం వచ్చేసింది. ఉబర్ కారు డ్రైవర్ ఫోనుని లాక్కుని బయటకు పడేసింది ఆ యువతి.
ఫోన్ కోసం డ్రైవర్ కారు దిగాడు. ఆ తర్వాత వెంటనే కారు డ్రైవర్ సీట్లో కూర్చున్న యువతి.. ఆ వాహనాన్ని డ్రైవ్ చేస్తూ దూసుకెళ్లింది. అంతేకాదు, ఉబర్ డ్రైవర్ క్రెడిట్ కార్డు కారులోనే ఉండడంతో దాన్ని కూడా వాడేసింది ఆ యువతి. ఈ ఘటన అమెరికాలో చోటుచేసుకుంది.
ఆస్టిన్ విమానాశ్రయం వైపుగా ఆమె కారును తీసుకెళ్లింది. ఉబర్ కారును చోరీ చేసి, డ్రైవర్ క్రెడిట్ కార్డును కూడా వాడుకున్న నిందితురాలు న్యూషా అలెగ్జాండ్రా అఫ్కామిని పోలీసులు అరెస్టు చేశారు. ఫోన్ కోసం కారు నుంచి దిగిన ఉబర్ డ్రైవర్ రోడ్డుపైనే ఉండిపోయాడు.
పోలీసులకు ఫోన్ చేసి జరిగిన విషయాన్ని చెప్పాడు. దీంతో పోలీసులు అఫ్కామిని పట్టుకున్నారు. డ్రైవర్ కారు నుంచి దిగిన తర్వాత అతడితో ఆ యువతి పలు వ్యాఖ్యలు చేసిందని పోలీసులు చెప్పారు. ‘నేను నీ కారుని తీసుకెళ్తున్నాను.. సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్ వద్ద ఈ కారును వదిలేస్తాను’ అని డ్రైవర్ కు ఆమె చెప్పింది. విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత ఆ యువతి డ్రైవర్ క్రెడిట్ కార్డుతో పలు వస్తువులు కొనుక్కుంది.
Viral Video: ఏనుగు బారినుంచి కుటుంబాన్ని కాపాడిన చిప్స్, శాండ్‌విచ్