Viral Video: ఏనుగు బారినుంచి కుటుంబాన్ని కాపాడిన చిప్స్, శాండ్‌విచ్
తన కుమారుడు తినగా మిగిలిన శాండ్‌విచ్, అలాగే కారులో ఉన్న చిప్స్ ను ఏనుగుకి ఇచ్చామని తెలిపాడు. శాండ్‌విచ్, చిప్స్ తమ..

elephant smashes van window
Elephant smashes van: ఆహారాన్ని వెతుక్కుంటూ రోడ్డుపైకి వచ్చిన ఓ ఏనుగు ఓ వ్యాను కిటికీని ధ్వంసం చేసింది. తొండాన్ని ఆ వాహనంలోకి పెట్టి ఆహారం కోసం వెతకసాగింది. దీంతో వ్యానులో ఉన్న కుటుంబం వణికిపోయింది. వ్యానులోకి ఏనుగు తన తొండాన్ని దూర్చడంతో ఏం చేయాలో తెలియక షాక్ అయిపోయారు.
దీంతో ఆ కుటుంబ సభ్యులకు వ్యాను డ్రైవర్ ఓ ఐడియా ఇచ్చాడు. ఏనుగు తినడానికి ఏమైనా ఇవ్వాలని అన్నాడు. కారులో ప్రయాణిస్తున్న వ్యక్తి.. ఏనుగుకి చిప్స్, శాండ్‌విచ్ ఇచ్చాడు. దీంతో వాటిని తీసుకుని, ఆ కుటుంబ సభ్యులను వదిలేసి వెళ్లిపోయింది ఆ ఏనుగు.
శ్రీలంకలోని యాలా నేషనల్ పార్క్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దీనిపై వ్యానులోని కసున్ బస్నాయక్ అనే వ్యక్తి మాట్లాడారు. తన కుటుంబంతో కలిసి తాను అద్దె వ్యానులో వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుందని చెప్పాడు. ఏనుగు వ్యానులో ఆహారం కోసం తొండంతో వెతకసాగిందని తెలిపాడు.
తన కుమారుడు తినగా మిగిలిన శాండ్‌విచ్, అలాగే కారులో ఉన్న చిప్స్ ను ఏనుగుకి ఇచ్చామని తెలిపాడు. శాండ్‌విచ్, చిప్స్ తమ ప్రాణాలు కాపాడాయని ఆయన అన్నాడు. తమకు ఎలాంటి గాయాలూ కాలేదని చెప్పాడు. వ్యానులో ఏనుగు తొండం పెట్టిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
This is what happens when elephants get used to being fed by humans in passing vehicles!! pic.twitter.com/t56QpEIA9y
— Evarts (@r_evarts) December 12, 2023