Snake: ఆకాశం నుంచి మహిళపై పడి చేతిని చుట్టేసిన పాము.. ఆ తర్వాత మరో విచిత్ర ఘటన

ఇంతలో ఆకాశం నుంచి నాలుగున్నర అడుగుల ఓ పాము ఆమెపై పడింది. పెగ్గి జోన్స్ కుడి ముంజేయిని ఆ పాము చుట్టేసింది.

Snake: ఆకాశం నుంచి మహిళపై పడి చేతిని చుట్టేసిన పాము.. ఆ తర్వాత మరో విచిత్ర ఘటన

US Woman

Snake – US Woman: ఆకాశం నుంచి చేపలు పడడం అప్పుడప్పుడు చూస్తూనే ఉంటాం. అయితే, ఆకాశం నుంచి పాము పడడాన్ని ఎప్పుడైనా చూశారా? అదీ మనిషిపై పడితే? ఇటువంటి అనుభవం ఎదురైతే ఒక్కసారిగా దడుచుకుంటాం. ఇటువంటి అనుభవాన్ని ఎదుర్కొంది ఓ మహిళ.

 hawk

hawk

అమెరికా(USA)లోని టెక్సాస్ కు చెందిన పెగ్గి జోన్స్ (64) అనే మహిళ తమకు సిస్బీ(Silsbee)లో ఉన్న స్థలంలోని చెరువులో సరదాగా చేపలు పడుతూ ఎంజాయ్ చేస్తోంది. ఇంతలో ఆకాశం నుంచి నాలుగున్నర అడుగుల ఓ పాము ఆమెపై పడింది. పెగ్గి జోన్స్ కుడి ముంజేయిని ఆ పాము చుట్టేసింది. చేతిని విదిలిస్తూ ఆమె కంగారు పడింది. ఇంతలో పాము.. ఆమె ముఖంపైకి ఎక్కబోయింది.

ఆ తర్వాత మరో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. ఓ గద్ద ఆకాశం వైపు నుంచి పెగ్గి జోన్స్ వద్దకు వచ్చి, ఆమె చేతిపై దాడి చేసింది. దేవుడా రక్షించు అంటూ పెగ్గి జోన్స్ కేకలు వేసింది. తన చేతికి చుట్టుకున్న పాము కోసమే గద్ద వచ్చిందని పెగ్గి జోన్స్ గుర్తించింది. పామును ఆ గద్ద ఆకాశ మార్గంలో తీసుకెళ్తుండగా ఆ సర్పం తనపై పడిందని ఆ మహిళ గ్రహించింది.

పాము తన చేతికి చుట్టుకుని ఉండగా, గద్ద పాముని తినేందుకు ప్రయత్నించడంతో ఆమె చేతికి గాయాలయ్యాయి. కొద్ది సేపటికి ఆ పాము కింద పడిపోయింది. పెగ్గి జోన్స్ వెంటనే ఆసుపత్రికి వెళ్లింది. చేతిపై గాయాలకు వైద్యులు చికిత్స చేశారని ఆమె మీడియాకు తెలిపింది.

Viral Video: నార్వేను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న తుఫాను.. భారీ వరదలకు కొట్టుకుపోయిన మొబైల్ ఇళ్లు