China : పచ్చని ప్రకృతి నడుమ వెరైటీ ఆకారంలో రెస్టారెంట్.. ఫిదా అవుతున్న కస్టమర్లు
రకరకాల థీమ్స్‌తో ఉన్న రెస్టారెంట్లకు వెళ్లడానికి కస్టమర్లు ఇటీవల ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అలాంటి వారి కోసం చైనాలో సరికొత్త రెస్టారెంట్ ఆహ్వానం పలుకుతోంది. పచ్చని చెట్ల నడుమ ఆకర్షిస్తున్న ఆ రెస్టారెంట్‌పై ఓ లుక్ వేయండి.

China
China : ఇటీవల కాలంలో రకరకాల థీమ్స్‌తో హోటల్స్ అందర్నీ ఆకర్షిస్తున్నాయి. కస్టమర్లను ఆకట్టుకోవడానికి నిర్వాహకులు రకరకాలుగా ప్రయత్నిస్తున్నారు. చైనాలోని ఓ రెస్టారెంట్ చూస్తే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఈ రెస్టారెంట్‌కి సంబంధించిన వీడియో ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది.
Dead Rat : బాబోయ్.. మటన్ కర్రీలో చచ్చిన ఎలుక..! ప్రముఖ రెస్టారెంట్లో కస్టమర్లకు ఊహించని షాక్
ప్రపంచంలోనే అత్యద్భుతమైన భవన నిర్మాణాలకు నిలయం చైనా. అక్కడ కొన్ని రెస్టారెంట్లు, దుకాణాలు కూడా వినూత్నంగా ఉంటాయి. చైనా చాంగ్కింగ్ మునిసిపాలిటీలో ఉంది వెరైటీ ఆకారంలో ఓ రెస్టారెంట్. గిరీష్ (Girish) అనే ట్విట్టర్ యూజర్ ఈ హోటల్ వీడియోను షేర్ చేశారు. స్ధూపం ఆకారంలో ఉన్న కాంక్రీట్ పైపులతో గుండ్రటి ఆకారపు రెస్టారెంట్‌ను నిర్మించారు. పైప్ బూత్‌లలో ఫుడ్ తినలేము అనుకునేవారికి రెస్టారెంట్ బయట కూడా టేబుల్‌పై ఆహారం అందిస్తారు. పచ్చని చెట్ల మధ్య ఆహ్లాదకరమైన వాతావరణంలో తమకి ఇష్టమైన ఫుడ్ తినాలి అనుకునేవారికి ఇది మంచి ప్రదేశం. ఈ రెస్టారెంట్‌పై నుంచి చూస్తే ఫ్లై ఓవర్లు, రహదారులు కనిపిస్తాయి.
చాంగ్కింగ్ సిటీ మొత్తం ప్రకృతి సౌందర్యానికి పెట్టింది పేరు. గతంలో ఇక్కడి నేచర్‌కి సంబంధించిన చాలా వీడియోలు వైరల్ అయ్యాయి. అందమైన అడవుల మధ్య ఉంటే ఈ సిటీలో ప్రస్తుతం ఈ రెస్టారెంట్ కస్టమర్లను ఆకర్షిస్తోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు డిన్నర్‌కి అనువైన రెస్టారెంట్ అని.. పెద్దగా చోటుని ఆక్రమించకుండా అద్భుతంగా కట్టారని కామెంట్లు చేశారు. ఏది ఏమైనా రెస్టారెంట్లు పెట్టాలనుకునేవారు ఈ మాత్రం క్రియేటివిటీని చూపిస్తేనే కానీ జనాల్ని అట్రాక్ట్ చేయగలరు.
Creative dining experience ??????@hvgoenka pic.twitter.com/FRvaD23yhW
— Girish ??️®© (@Girish_99999) July 3, 2023