viral video : లైవ్‌లో తడబడిన బీబీసీ యాంకర్.. వైరల్ అవుతున్న వీడియో

లైవ్ సమయంలో యాంకర్లు తడబడిన వీడియోలు గతంలో అనేకం వైరల్ అయ్యాయి. తాజాగా బీబీసీ ప్రెజెంటర్ లైవ్‌లో తడబడిన వీడియో వైరల్ అవుతోంది. నెటిజన్లు మిశ్రమంగా స్పందించారు.

viral video : లైవ్‌లో తడబడిన బీబీసీ యాంకర్.. వైరల్ అవుతున్న వీడియో

viral video

Updated On : August 24, 2023 / 12:07 PM IST

viral video : లైవ్ బ్రాడ్ కాస్ట్ సమయంలో యాంకర్లు ఏ మాత్రం అలర్ట్‌గా లేకపోయినా తప్పులు దొర్లడం ఖాయం. తాజాగా బీబీసీ ప్రజెంటర్ గారెత్ బార్లో లైవ్‌లో తడబడిన వీడియో వైరల్ అవుతోంది.

Varshini Sounderajan : హైపర్ ఆదితో పెళ్లి రూమర్స్.. స్పందించిన యాంకర్..

లైవ్ ప్రసారంలో ప్రెజెంటర్లు చాలా జాగ్రత్త వహించాలి. ఏ మాత్రం తడబడినా ప్రేక్షకులకు దొరికిపోయినట్లే .. అలాంటి వీడియోలు వైరల్ అయిన సందర్భాలు ఉన్నాయి. తాజాగా బీబీసీ ప్రెజెంటర్ గారెట్ బ్లారో తాను లైవ్‌లో తడబడిన వీడియోను స్వయంగా తన ట్విట్టర్ అకౌంట్లో షేర్ చేయడం విశేషం. 12 సెకన్ల వీడియో క్లిప్‌లో మిస్టర్ బార్లో కెమెరా వైపు చూస్తూ ‘మీరు చూస్తున్నారు’ అని చెప్పకుండా పొరపాటున ‘నేను చూస్తున్నాను’ అని ముగించారు. ఈ వీడియోను గారెత్ బార్లో (@GarethBarlow) ‘వార్తలను ఎవరు చూస్తున్నారో దయచేసి ఎవరైనా నాకు గుర్తు చేయగలరా…’ అనే శీర్షికతో షేర్ చేసారు.

Rashmi Gautam : బాయ్స్ హాస్టల్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో యాంకర్ రష్మీ..

ఈ వీడియోపై ట్విట్టర్లు యూజర్లు మిశ్రమంగా స్పందించారు. ‘మీరు బీబీసీ న్యూస్ చూస్తున్నారు.. దానిని హోస్ట్ చేస్తున్నారు.. ఇందులో తప్పేం లేదు’ అని ఒకరు.. ‘కనీసం ఏ ప్రోగ్రా చేస్తున్నారో గుర్తుంచుకున్నారా?’ అని మరొకరు కామెంట్లు చేశారు. ప్రస్తుతం ఈ వీడియోకి 8 లక్షలు దాటి వ్యూస్ వచ్చాయి.