Viral Video : భారీ కొండచిలువపై చిరుత దాడి.. వీడియో వైరల్..!
ఆ చిరుతకు బాగా ఆకలి వేసింది. ఆహారం కోసం వెతుకుతూ చెరువులోకి వెళ్లింది. అక్కడే భారీ కొండచిలువ కనిపించింది. ఈ రోజుకు ఆహారం దొరికిందిలే అనుకుని దగ్గరగా వెళ్లింది.

Viral Video Python, Leopard Swooped Down On Seeing What Happened Again, Watch The Video
Viral Video : ఆ చిరుతకు బాగా ఆకలి వేసింది. ఆహారం కోసం వెతుకుతూ చెరువులోకి వెళ్లింది. అక్కడే భారీ కొండచిలువ కనిపించింది. ఈ రోజుకు ఆహారం దొరికిందిలే అనుకుని దగ్గరగా వెళ్లింది. ఏమాత్రం ఆలస్యం లేకుండా వెంటనే ఆ భారీ కొండచిలువను నోట కరిచింది. ఈ క్రమంలో చిరుత నుంచి తప్పించుకునేందుకు కొండచిలువ తన బలాన్ని మొత్తం ఉపయోగించింది.
చిరుతను చుట్టేసేందుకు ప్రయత్నించింది. అయినా ఫలితం లేకపోయింది. చిరుత దాన్ని వదల్లేదు. అలానే నోట కరుచుకుని గట్టుపైకి ఈడ్చుకెళ్లింది. ఈ ఘటనకు సంబంధించి వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ ‘పైథాన్ను చిరుత ఏం చేసిందో తెలియదు అంటూ నెటిజన్లు సరదాగా కామెంట్లు చేస్తున్నారు.
View this post on Instagram
చిరుత నుంచి ఆ కొండచిలువ తప్పించుకుందా? లేదా చిరుతను తన బలమైన శరీరంతో చుట్టేసిందా? ఇంతకీ ఈ పోరులో ఎవరిది? గెలుపు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియోను ఇన్ స్ట్రాగ్రామ్ యూజరు తన అకౌంట్లో పోస్టు చేయడంతో వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో జంతువులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియలో వైరల్ అవుతుంటాయి. ఇలాంటి వీడియోలను చూడగానే నెటిజన్లు తమ సోషల్ మీడియా అకౌంట్లలో షేర్ చేస్తుంటారు.
Read Also : Wedding Guests Fight : పెళ్లిలో లొల్లి.. నడిరోడ్డుపై ఎలా కొట్టేసుకున్నారో చూడండి.. !