వైరల్ వీడియో: యువతి టిక్‌టాక్ చేస్తుండగా అకస్మాత్తు పై నుంచి పడిన కాలు

  • Published By: vamsi ,Published On : September 4, 2020 / 02:59 PM IST
వైరల్ వీడియో: యువతి టిక్‌టాక్ చేస్తుండగా అకస్మాత్తు పై నుంచి పడిన కాలు

Updated On : September 4, 2020 / 4:35 PM IST

భారత్‌లో టిక్ టాక్ బ్యాన్ కాకముందు అదొక ప్రపంచంగా మారిపోయింది యువతకు. రోజుకో సెన్సేషన్.. గంటకో వీడియో అన్నట్లుగా యువత ఉత్సాహంగా టిక్‌టాక్ చేసుకునేవాళ్లు అయితే భారత్‌లో టిక్ టాక్ గోల దాదాపుగా అంతరించిపోగా.. మిగిలిన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో తమ ప్రతిభను అన్ని రకాల అనువర్తనాల్లో చూపించడానికి ప్రయత్నిస్తున్నారు.



ఇదిలా ఉంటే షార్ట్ వీడియో యాప్ టిక్‌టాక్‌ వీడియోలు.. ఇన్‌స్టాగ్రమ్, ఫేస్‌బుక్‌లలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఓ విదేశీ యువతి టిక్‌టాక్ వీడియో ప్రపంచమంతా వివిధ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది.

ఈ 10 సెకన్ల వీడియోను టిక్‌టాక్ యూజర్ లిజ్ శాన్ మిలన్ పోస్ట్ చేశారు. యువతి టిక్‌టాక్ వీడియో పాట పాడుతూ తన గాన ప్రతిభ చూపిస్తున్న సమయంలో.. చెక్క ఇంటి పైకప్పు నుంచి తల్లి కాలు బయటకు వచ్చింది. ఈ దృశ్యం చూసి శాన్ మిలన్ గట్టిగా అరిచింది. కెమెరాలో వాయిస్‌తో సహా ఇదంతా క్లియర్‌గా రికార్డ్ చేయబడింది.



ఈ వీడియోను షేర్ చేసిన శాన్ మిలన్.. అకస్మాత్తుగా పైకప్పు నుంచి కింద పడింది నా తల్లి అని రాసుకొచ్చింది. ఈ వీడియో సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతోంది. ఇది ఇప్పటివరకు 5 మిలియన్‌ల మంది వీక్షించారు. అలాగే 1.5 మిలియన్లకు పైగా లైక్‌లు వచ్చాయి.

శాన్ మిలన్ తన మ్యూజిక్ ఆడిషన్ కోసం పాడుతుండగా.. ఆమె తల్లి తన గది పైన ఉన్న అటకపై నుంచి పడిపోయింది. శాన్ మిలన్ తన తల్లికి తీవ్రంగా గాయపడలేదని, కానీ ఆమె షాక్‌కు గురైనట్లు చెప్పుకొచ్చింది. వీడియోలో వస్తున్న వ్యాఖ్యలను చదవుతూ తన తల్లి ఆనందిస్తోందని శాన్ చెబుతున్నారు.


 

View this post on Instagram

 

OMG

A post shared by BLACK LIVES MATTER (@klownary) on