Taliban : భారత్ తో సంబంధాలపై తొలిసారి స్పందించిన తాలిబన్ అగ్రనేత

భారత్‌ తో రాజకీయ, వాణిజ్య, సాంస్కృతిక సంబంధాలను కొనసాగించాలని అప్ఘానిస్తాన్ కోరుకుంటుందని తాలిబన్ అగ్రనేత షేర్ మహమ్మద్ అబ్బాస్ స్టనెక్‌జాయ్ తెలిపారు.

Taliban : భారత్ తో సంబంధాలపై తొలిసారి స్పందించిన తాలిబన్ అగ్రనేత

Sher

Updated On : August 29, 2021 / 8:02 PM IST

Taliban భారత్‌ తో రాజకీయ, వాణిజ్య, సాంస్కృతిక సంబంధాలను కొనసాగించాలని అప్ఘానిస్తాన్ కోరుకుంటుందని తాలిబన్ అగ్రనేత షేర్ మహమ్మద్ అబ్బాస్ స్టనెక్‌జాయ్ తెలిపారు. కాగా,అఫ్ఘానిస్తాన్‌ను వశం చేసుకున్న తర్వాత తాలిబన్ అగ్రనేత ఒకరు భారత్‌ గురించి మాట్లాడటం ఇదే తొలిసారి. ఇప్పటివరకు తాలిబన్ అధికార ప్రతినిధులు సుహెయిల్ షహీన్, జబీహుల్లా ముజాహిద్ భారతదేశంతో సంబంధాల గురించి మాట్లాడారు. అయితే ఇతర దేశాలతో సంబంధాల గురించి స్టనెక్‌జాయ్ వంటి తాలిబన్ అగ్రనేత ఒకరు మాట్లాడటం ఇదే తొలిసారి. దీనికి సంబంధించిన ఓ వీడియోను తాలిబన్ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ లో శనివారం పోస్ట్ చేశారు.

46 నిమిషాల నిడివిగల వీడియోలో.. ఆఫ్ఘనిస్తాన్ లో యుద్ధం ముగిసిందని షేర్ మహమ్మద్ చెప్పారు. షరియా ఆధారంగా ఇస్లామిక్ ప్రభుత్వాన్ని ఏర్పాటుకి తాలిబన్ ఫ్లాన్ చేస్తుందన్నారు. భారత్, పాకిస్తాన్, చైనా, రష్యా సహా వివిధ దేశాలతో సంబంధాలపై తాలిబన్ ల అభిప్రాయాల గురించి మాట్లాడుతూ.. భారత్‌తో రాజకీయ, వాణిజ్య, సాంస్కృతిక సంబంధాలను కొనసాగిస్తామన్నారు. ఇక, అప్ఘాన్ లోని చాంబహార్ పోర్టుని భారత్ అభివృద్ధి చేసిన విషయాన్నిషేర్ మహమ్మద్ అబ్బాస్ స్టనెక్‌జాయ్ గుర్తు చేశారు.

ఈ ఉపఖండంలో భారత దేశం చాలా ముఖ్యమైన దేశమని షేర్ మహమ్మద్ అన్నారు. గతంలో మాదిరిగానే అన్ని రకాల సంబంధాలను భారత్ తో కొనసాగిస్తామన్నారు. పాకిస్తాన్ గుండా భారతదేశం నుంచి వాణిజ్యం జరగడం తమకు చాలా ముఖ్యమని చెప్పారు. భారత్ తో.. గగనతలం గుండా వాణిజ్యం కూడా ఎప్పటిలాగే తేరిచే ఉంటుందన్నారు. అయితే, భారతదేశం గుండా వాణిజ్యం రెండు విధాలుగా ఉంటుందని ఆయన చెప్పలేదు. పాకిస్తాన్.. తమ భూభాగం ద్వారా అఫ్ఘాన్ వ్యాపారులు తమ వస్తువులను భారతదేశానికి రవాణా చేయడానికి అనుమతించింది.. కానీ పాకిస్తాన్ భూభాగం ద్వారా అఫ్ఘానిస్తాన్‌కు భారత్ వస్తువులను రవాణా చేయడానికి ఎన్నడూ అనుమతించలేదు.

READ Mohammad Abbas: భారత మిలిట్రీ అకాడ‌మీలో ట్రైనింగ్ పొందిన అఫ్ఘన్‌ తాలిబన్‌ అగ్రనేత