Washington Recruits Dogs And Cats: ఎలుకలను పట్టుకునేందుకు కుక్కలు, పిల్లుల నియామకం

అగ్రరాజ్యమైన అమెరికా దేశంలోని వాషింగ్టన్ నగరంలో ఎలుకల బెడద పెచ్చుపెరగడంతో వీటి నివారణకు ప్రభుత్వం రంగంలోకి దిగి ఎలుకలపై యుద్ధం ప్రకటించింది. ఎలుకలను పట్టుకునేందుకు కుక్కలు, పిల్లులను తాజాగా రంగంలోకి దించారు....

Washington Recruits Dogs And Cats: ఎలుకలను పట్టుకునేందుకు కుక్కలు, పిల్లుల నియామకం

ఎలుకల బెడద నివారణకు కుక్కలు, పిల్లుల నియామకం

Updated On : June 19, 2023 / 12:34 PM IST

Washington Recruits Dogs And Cats: అగ్రరాజ్యమైన అమెరికా దేశంలోని వాషింగ్టన్ నగరంలో ఎలుకల బెడద పెచ్చుపెరగడంతో వీటి నివారణకు ప్రభుత్వం రంగంలోకి దిగి ఎలుకలపై యుద్ధం ప్రకటించింది. అమెరికా రాజధాని నగరమైన వాషింగ్టన్ నగరంలో నైట్ లైఫ్, డైనింగ్ హాట్ స్పాట్ అయిన ఆడమ్స్ మోర్గాన్ పరిసరాల్లో ఎలుకల బెడద(War On Rodents) మరీ ఎక్కువగా ఉంది. వాషింగ్టన్ నగరంలో ఎలుకల సంఖ్య వేగంగా పెరిగిపోతుండటంతో వీటి వల్ల ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు.

Khalistani terrorist Hardeep Singh :కెనడాలో ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ కాల్చివేత

ఎలుకలు రెస్టారెంట్లు, బార్‌లు, క్లబ్‌ల వెనుక ఉన్న సందుల్లో తిరుగుతున్నాయి. చెత్తలో విసిరేసిన అహారపదార్థాలను ఎలుకలు తింటున్నాయి. కరోనా అనంతరం నగరంలో బహిరంగ భోజన ప్రాంతాలు వెలియడంతో ఎలుకల బెడద మరింత పెరిగింది. 2022వ సంవత్సరంలో ఎలుకల సమస్యల గురించి హాట్ లైన్ కు 13,400 ఫోన్ కాల్స్ వచ్చాయి. 2021వ సంవత్సరం కంటే రెండువేల ఫోన్ కాల్స్ ఎక్కువగా వచ్చాయి.

Heavy Rainfall in Tamil Nadu: పలు రాష్ట్రాల్లో భారీవర్షాలు.. తమిళనాడులో స్కూళ్లకు సెలవులు

నగరంలో పెచ్చు పెరిగిపోతున్న ఎలుకల బెడదను నివారించడానికి కుక్కలు, పిల్లులను రంగంలోకి దించారు. ఎలుకలను పట్టుకోవడంలో కుక్కలు, పిల్లులకు శిక్షణ ఇచ్చి వాటి ద్వారా ఎలుకల బెడదకు తెర వేయాలని నిర్ణయించారు.దీనికోసం శిక్షణ పొందిన కుక్కలు, పిల్లులను రిక్రూట్ చేసుకొని వీటి సాయంతో ఎలుకలను నివారించాలని నిర్ణయించారు. దీనికోసం ప్రత్యేకంగా ఓ ప్రోగ్రాంను అధికారులు అమలు చేస్తున్నారు.  మొత్తంమీద ఎలుకల బెడదను అదుపు చేయడానికి కుక్కలు, పిల్లులను నియమించేందుకు ప్రత్యేకంగా ఓ కార్యక్రమాన్ని కూడా సర్కారు చేపట్టింది.